నితీష్‌కు షాక్: మోడీ హవా, 21-29 సీట్లు బిజెపికి

BJP-LJP Alliance in Bihar May Bag 21 to 29 LS Seats: Survey
న్యూఢిల్లీ: బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు బిజెపి షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీహార్‌లో బిజెపి-ఎల్జీపిల కూటమి 21 నుండి 29 పార్లమెంటు స్థానాల వరకు గెలుచుకోనుందట. సిఎన్ఎన్ ఐబిఎన్ - ది వీక్ జరిపిన సర్వేలో గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హవాకు రామ్ విలాస్ పాశ్వాన్ తోడు కావడం ఎన్డీయేకు కలిసి వస్తోందని తేలింది.

సర్వే ప్రకారం... అధికార జెడి(యు) రెండు నుండి ఐదు సీట్లకు పరిమితం కానుంది. కాంగ్రెసు - ఆర్జెడి-ఎన్సీపి కూటమి 7 నుండి 13 స్థానాలను గెలుచుకుంటుంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెసు 23-29 వరకు గెలుస్తుంది. ఒడిశాలో బిజెడికి 10-16 దక్కవచ్చు. మూడు నుండి ఏడు సీట్లతో బిజెపి ఒడిశాలో రెండో స్థానంలో నిలవనుంది. కాంగ్రెసు నాలుగు గెలుచుకునే అవకాశముంది.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఖాతా తెరిచే అవకాశాలు లేదు. పశ్చిమ బెంగాల్, అస్సాం, జార్ఖండ్ రాష్ట్రాలలో కాంగ్రెసు పార్టీ తొమ్మిది శాతం ఓటింగ్ షేర్‌ను పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా, ఒపినియన్ పోల్‌లో భాగంగా సిఎన్ఎన్ ఐబిఎన్ - ది వీక్ 20,957 మంది ఓటర్ల నుండి అభిప్రాయం తీసుకుంది. 1,340 ప్రాంతాలలో ఈ అభిప్రాయాలను సేకరించారు. ప్రతి సెగ్మెంటులో నాలుగు పోలింగ్ సెంటర్ల పరిధిలోని ఓటర్ల అభిప్రాయాలను తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+