బీజేపీ నుంచే వామపక్షాలకు ప్రధాన ముప్పు: బుద్ధదేవ్ భట్టాచార్జీ
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో జరిగిన శారదా చిట్ ఫండ్ స్కాంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నానాటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మమత బెనర్జీ ప్రభుత్వంపై నిన్నటి వరకు బీజేపీ దాడి చేస్తే తాజాగా... ఆమె చేతిలో ఓటమిపాలైన ఆ రాష్ట్ర మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్జీ ప్రత్యక్షంగా విమర్శించారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - మార్కిస్ట్ (సీపీఎం-ఎమ్)కు సంబంధించిన పత్రిక 'ఘనశక్తి' 49వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీలకు బీజేపీ నుంచి ప్రధాన ముప్పు ఉందని చెప్పారు. మతతత్వ శక్తులను రాష్ట్రంలో ఎట్టి పరిస్ధితుల్లోనే ప్రొత్సహించకూడదని హితవు పలికారు.

ఇక రాష్ట్రంలో పరిపాలన కొనసాగేందుకు తృణమూల్ కాంగ్రెస్ కు నైతిక హక్కు లేదని బుద్ధదేవ్ అన్నారు. శారదా స్కాంలో ఆ పార్టీ నేతలు ఎలా పాలుపంచుకున్నారో మాకు తెలుసని చెప్పారు. బెంగాల్ రాజకీయ చరిత్రలో ఈ తరహా కుంభకోణం జరగలేదని... సాక్షాత్తు కేబినెట్ మంత్రి జైలుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు.
దీంతో ఆ పార్టీ నేతల ప్రమేయం ఎంత ఉందనేది అర్ధం అవుతుందని ఆయన ఆరోపించారు. మమతా బెనర్జీ తక్షణమే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ఇకపై ఒక్క క్షణం కూడా రాష్ట్రంలో పాలన సాగించేందుకు తృణమూల్ కు నైతిక హక్కు లేదని ఆయన తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications