ఉత్తరాఖండ్ సీఎంగా క్లీన్ ఇమేజ్ ప్లస్ యువ నేత
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి భారీ మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ నాయకత్వం.. రాష్ట్ర సీఎంగా క్లీన్ ఇమేజ్ కలిగి ఉండటంతోపాటు యువ నేతకు సారథ్యం అప్పగించాలని భావిస్తున్నది. నలుగురు మాజీ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి భారీ మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ నాయకత్వం.. రాష్ట్ర సీఎంగా క్లీన్ ఇమేజ్ కలిగి ఉండటంతోపాటు యువ నేతకు సారథ్యం అప్పగించాలని భావిస్తున్నది. నలుగురు మాజీ ముఖ్యమంత్రులు బీ సీ ఖండూరీ, భగత్ సింగ్ కోషియారీ, రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్, విజయ్ బహుగుణలతోపాటు సీనియర్ నేతలు సత్పాల్ మహారాజ్, యశ్ పాల్ ఆర్య తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
70 స్థానాల అసెంబ్లీకి 56 స్థానాల్లో బీజేపీ చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. పలువురు సీఎం పదవి కోసం పోటీ పడుతుండటంతో ఎవరిని ఆ పదవికి ఎంపిక చేయాలో అర్థంగానీ గందరగోళ పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం ఉన్నది.
ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీలను నిర్విఘ్నంగా అమలు చేసే సత్తాతోపాటు ప్రజల విశ్వాసాన్ని చూరగొన గల సామర్థ్యం గల నేత ఎవరన్న విషయమై ద్రుష్టి సారించింది.

యువ నేతలతోపాటు పరిశీలనలో సీనియర్లు
ప్రజలు ఘన విజయం అందించిన తర్వాత వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటుందని, సీఎం అభ్యర్థి ఎంపికలో ఆ అంశాలే ప్రమాణికంగా ఉంటాయని సీనియర్ బీజేపీ నేత ఒకరు పేర్కొన్నారు. సీఎం ఎంపికకు ఇవే ప్రమాణాలని కూడా చెప్పారు. ప్రచారం చివరి దశలో ప్రజలకు మేలు కలిగించే టీమ్‌ను ఎంపిక చేయడంతోపాటు వారి పనితీరును నేరుగా పర్యవేక్షిస్తానని మోదీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే సామర్థ్యం గల నేత ఎవరన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఆరెస్సెస్ తో అనుంబంధమా? సామర్థ్యమా?
సీనియర్లు ఖండూరీ, కోషియారీ, రమేశ్ పోఖ్రియాల్, విజయ్ బహుగుణలతోపాటు చౌబత్తాఖండ్ ఎమ్మెల్యే సత్పాల్ మహారాజ్, డౌవాలా ఎమ్మెల్యే త్రివేంద్ర సింగ్ రావత్, పితోర్ గఢ్ ఎమ్మెల్యే ప్రకాశ్ పంత్ పేర్లను బీజేపీ నాయకత్వం సీరియస్‌గా పరిశీలిస్తోంది. యువతరం నేతలతో పోలిస్తే సీనియర్లు ఖండూరీ, కోషియారీ, సత్పాల్ మహారాజ్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వ్రుద్ధ నేత అయినా ఖండూరీకి క్లీన్ ఇమేజ్ ఉన్నది. రమేశ్ పొఖ్రియాల్ కు ఆరెస్సెస్ తో గల సంబంధాలు సానుకూలంగా ఉన్నాయి.

సత్పాల్ మహారాజ్ ఆమోద యోగ్యుడైనా
ఇక అన్ని వర్గాలకు ఆమోద యోగ్యమైన.. ఆధ్యాత్మిక నేతగా సత్పాల్ మహారాజ్ నాయకత్వంపై తిరుగులేని విశ్వాసం ఉన్నా.. ఆయన మూడేళ్ల క్రితం 2014లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరడం ప్రతికూల అంశమే. ఇక యువ నాయకుడిగా ఉన్న రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ వంటి వివాదాస్పద నాయకుడ్ని నాయకత్వం పరిగణనలోకి తీసుకోవడం ఒకింత కష్ట సాధ్యమే మరి. ఆపద్ధర్మ సీఎం హరీశ్ రావత్‌ను హరిద్వార్ రూరల్ స్థానంలో ఓటమి బాట పట్టించడంతో ఈ హరిద్వార్ లోక్ సభ సభ్యుడు రమేశ్ పోఖ్రియాల్ పాత్ర కీలకమైందన్న సంగతిని బీజేపీ అథి నాయకత్వం విస్మరించలేనిది.

బీజేపీ నాయకత్వ పరిశీలన ఇలా..
వివాదాలకు అతీతంగా, అందరి పట్ల గౌరవ భావం గల నేత.. బీజేపీ ఉత్తరాఖండ్ చీఫ్‌గా అజయ్ భట్.. రాష్ట్రంలో పార్టీని విజయ తీరాలకు నడిపించడంలో కీలక పాత్ర పోషించినా రాణిఖేట్ స్థానం నుంచి ఓటమి పాలవ్వడంతో సీఎంగా ఆయనను నియమించాలంటే కాస్త ఆలోచించాల్సిందే మరి. ఈ పరిస్థితుల్లో డోయివాలా ఎమ్మెల్యే త్రివేంద్ర సింగ్ రావత్, పితోర్‌గఢ్ ఎమ్మెల్యే ప్రకాశ్ పంత్ కూడా టాప్ ఫేవరెట్లుగా ఉన్నారు. త్రివేంద్ర సింగ్.. 2014లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి స్ఫూర్తి దాయక విజయం సాధించి పెట్టడంలో ముఖ్యభూమిక పోషించారు. అంతే కాదు పార్టీ నాయకత్వం పట్ల తిరుగులేని విధేయత గల నేతగా ఆయనకు పేరున్నది.

యువతరం అవకాశాలివి..
ఇక మాజీ మంత్రి ప్రకాశ్ పంత్ కూడా యువ నేతగా, శాసనసభా వ్యవహారాల్లో అనుభవం ఉన్న నేతగా పేరుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా చేరడంతోపాటు విజయం సాధించిన యశ్ పాల్ ఆర్యా, హరక్ సింగ్ రావత్ తదితర బడా నాయకులు కూడా పోటీ పడుతున్నా.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి రావడం ఇబ్బందికరంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో సీనియర్లు, యువ నేతలు పోటీ పడుతున్నందున ఉత్తరాఖండ్ సీఎంను ఎంపిక చేయడం బీజేపీ నాయకత్వానికి కత్తిమీద సాము వంటిదే. ఆరెస్సెస్ తో అనుబంధం గల నేతను సీఎంగా కూర్చుండబెడతారా? సీనియర్లకు పెద్దపీట వేస్తారా? యువతరానికి అవకాశం కల్పిస్తారా? వీటన్నింటికి మించి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సత్తా ఉందని ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విశ్వాసం పొందే నేత ఎవరో తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే మరి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications