ఎబిపి ఎగ్జిట్ పోల్స్: సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లో బిజెపిదే హవా
Recommended Video

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో రెండు విడతలుగా జరిగిన ఎన్నికల్లో బిజెపికి అనుకూల వాతావరణం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. పలు మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఈ మేరకు ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తర గుజరాత్ ప్రాంతంలో బిజెపి 32-38 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉంది.కాంగ్రెస్ పార్టీ కేవలం 22 సీట్లను కైవసం చేసుకొనే అవకాశం ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
గుజరాత్ రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ పూర్తైంది. గుజరాత్ రాష్ట్రంలో విజయం సాధించేందుకు బిజెపి జాతీయ నాయకత్వం అక్కడే మకాం వేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న రాహుల్ గాంధీ కూడ గుజరాత్ రాష్ట్రంలో సుమారు మూడు మాసాలకు పైగా ప్రచారం నిర్వహించారు.ఈ మేరకు ఎబిపి నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా సౌరాష్ట్ర రీజియన్‌లో బిజెపి ఆధిపత్యం స్పష్టంగా కన్పిస్తోంది.

సౌరాష్ట్ర రీజియన్‌లో బిజెపిదే ఆధిపత్యం
గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర రీజియన్‌లో బిజెపి స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబర్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఉత్తర గుజరాత్ ప్రాంతంలో సుమారు 32-38 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకొనే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ 16-22 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకొనే అవకాశం కూడ లేకపోలేదు.అయితే 49 శాతం ఓట్లు బిజెపికి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

సౌరాష్ట్రలో కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు
సౌరాష్ట్ర రీజియన్‌లో కాంగ్రెస్ పార్టీకి 41 శాతం ఓట్లు దక్కనున్నాయి.అయితే ఇదే రీజియన్‌లో బిజెపికి 49 శాతం ఓట్లు దక్కనున్నాయి. దీంతో ఈ రీజియన్‌లో బిజెపికి ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది.ఈ ఓట్ల శాతం మేరకు కాంగ్రెస్ పార్టీ 16 నుండి 22 సీట్లను కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఎబిపి సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

సెంట్రల్ గుజరాత్‌లో బిజెపిదే హవా
సెంట్రల్ గుజరాత్‌లో కూడ బిజెపిదే హవా ఉండే అవకాశం ఉందని ఈ సర్వే నివేదిక వెల్లడిస్తుంది.47 శాతం ఓట్లతో బిజెపి 21 నుండి 27 సీట్లను కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఈ సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.42 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 13 నుండి 19 సీట్లను కైవసం చేసుకొనే అవకాశం లేకపోలేదని ఎగ్జిట్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

దక్షిణ గుజరాత్‌లో బిజెపి క్లీన్ స్వీప్
దక్షిణ గుజరాత్‌లో బిజెపి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఎబిపి ఎగ్జిట్ సర్వే పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 35 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి 21 నుండి 27 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉంది.అయితే 52 శాతం ఓట్లు బిజెపికి దక్కే అవకాశం ఉందని ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీకి కేవలం 9 నుండి 13 సీట్లు దక్కే అవకాశం లేకపోలేదు. కేవలం 40 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

సౌరాష్ట్రలో 2012లో 33 సీట్లను గెలుచుకొన్న బిజెపి
సౌరాష్ట్ర రీజియన్‌లో బిజెపి 2012 ఎన్నికల్లో 33 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొంది.కచ్ రీజియన్‌లో కూడ బిజెపి ఆదిపత్యాన్ని సాధించింది. ఐదు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొంది. ఆరు స్థానాలు ఉంటే ఐదింటిని బిజెపి విజయం సాధించింది.












Click it and Unblock the Notifications