‘ఆ వీడియోలు నేనూ చూస్తా’: మంత్రి, సారీ(వీడియో)
పుణె: మహారాష్ట్రకు చెందిన ఓ మంత్రి తన స్థాయిని, బాధ్యతను మర్చిపోయారు. ఓ కళాశాల స్నాతకోత్సవానికి వెళ్లిన ఆయన.. విద్యార్థుల సమక్షంలో అశ్లీలాన్ని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కడంతో అన్ని పక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించడంతో ఆ మంత్రి తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయనే మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి గిరీశ్ బపత్. గత శుక్రవారం రాత్రి పుణెలోని ఓ కళాశాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. ‘రాత్రిపూట మీరు మొబైల్ ఫోన్లలో ఎలాంటి వీడియో క్లిప్స్ చూస్తారో.. మేం కూడా అవే చూస్తాం. మా వయసైపోయిందని మీరు అనుకుంటారు.. కానీ మనసుకు మాత్రం మేమింకా యువకులమే' అని వ్యాఖ్యానించారు.
అక్కడి వారికి ఆయన వ్యాఖ్యలు నవ్వులు తెప్పించినప్పటికీ.. ఆ తర్వాత తీవ్ర దుమారం రేపాయి. మంత్రి వ్యాఖ్యలపై రాజకీయ పార్టీల నుంచి, వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఆయనపై ఓ న్యాయ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో గిరీశ్‌ప సొంతపార్టీ భారతీయ జనతా పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications