దాడి చేసిన ఆ బీజేపీ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

భోపాల్ : కొద్దిరోజుల క్రితం మున్సిపల్ అధికారిపై బ్యాటు చేసి జైలుపాలైన బీజేపీ ఎమ్మెల్యే ఆకాష్ విజయ్ వర్గీయకు భోపాల్‌లోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మధ్యప్రదేశ్‌ బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ కుమారుడైన ఆకాష్ విజయ్‌వర్గీయ జూన్ 26వ తేదీన ఓ మున్సిపల్ అధికారిపై దాడి చేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో సహనం కోల్పోయిన ఆకాష్ క్రికెట్ బ్యాట్‌తో మున్సిపల్ అధికారిపై దాడి చేశాడు.

ఈ ఘటన జరిగిన మరుసటి రోజున కరెంటు కోతలపై నిరసన తెలిపిన కేసులో ఆకాష్ అరెస్టయ్యారు. అయితే ఇక రెండు కేసుల్లో ఆకాష్‌కు బెయిల్ మంజూరు చేసింది ప్రత్యేక కోర్టు. రూ.50వేలు, రూ.20వేలు పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించడంతో ఆయన ఇండోర్‌లోని సెషన్స్ కోర్టుకు అప్పీల్ చేశారు. అయితే వాదనలు విన్న సెషన్స్ కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. భోపాల్‌లో ఎంపీ ఎమ్మెల్యేల కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తుండటంతో రిజర్వ్‌లో ఉంచింది.

Recommended Video

    ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు
    BJP MLA Akash Vijayvargiya granted bail by Special court

    ఇక మున్సిపల్ అధికారిపై ఆకాష్ క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 10 మందిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా ఆయన్ను జూలై 7వరకు జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలంటూ ఆదేశించింది. మీడియా కెమెరాలు ఉన్నప్పటికీ ఆయన వీటినేవీ ఖాతరు చేయకుండా అధికారిపై దాడి చేశాడు. అంతేకాదు అతని చర్యను కూడా సమర్థించుకున్నారు. బీజేపీలో ముందుగా విజ్ఞప్తి చేయడం నేర్చుకుంటామని మాట వినకపోతే దాడి చేస్తామంటూ చెప్పుకొచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+