ప్రత్యర్థి పార్టీ కంటే సొంత పార్టీ ఎమ్మెల్యే దెబ్బతో మైండ్ బ్లాక్, మోదీతో సహ అందరూ !

బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ దెబ్బకు సొంత పార్టీ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువగా బీజేపీ నాయకులను టార్గెట్ చేసుకున్న సొంత పార్టీ నాయకుడు బసవనగౌడ పాటిల్ ఆరోపణలకు సమాధానాలు చెప్పలేక కర్ణాటకలోని మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జుట్టు పీక్కుంటున్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప బీజేపీ హైకమాండ్ ను బ్లాక్ మెయిల్ చేసి ఆయన కుమారుడు బీవై విజయేంద్రకు కర్ణాటక బీజేపీ అధ్యక్ష పదవి ఇప్పించుకున్నారని ఇటీవల బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉత్తర కర్ణాటకలోని బీజేపీ నాయకులకు ప్రత్యేకంగా అధ్యక్ష పదవి, ప్రతిపక్ష నాయకుడి పదవి ఇవ్వాలని బసవనగౌడ పాటిల్ యత్నాలు డిమాండ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

 BJP MLA Basavanagowda Patil Yatnal is making sensational allegations targeting BY Vijayendra

బసవనగౌడ పాటిల్ యత్నాల్ వర్సెస్ బీజేపీ రాద్దాంతం ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు కొత్త ఆయుధంగా చిక్కింది. కర్ణాటక బీజేపీ నేత, సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ అసంతృప్తితో ముందడుగు వేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ, ప్రతిపక్ష నేతలపై బసవనగౌడ పాటిల్ యత్నాల్‌ ట్వీట్లు చేస్తూ కర్ణాటక రాష్ట్ర బీజేపీ శాఖ ఆ దేవుడు కూడా రక్షించలేరనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 BJP MLA Basavanagowda Patil Yatnal is making sensational allegations targeting BY Vijayendra

బసవనగౌడ పాటిల్ యత్నాల్ విజయేంద్రను టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి బపవరాజ్ బోమ్మయ్ ని ఓడించేందుకు బీవై. విజయేంద్ర విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారని, వి.సోమ్మన్న రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు విజయేంద్ర కుట్ర పన్నారని, పంచమసాలీ కులస్తుల పోరాటాన్ని అణిచివేసేందుకు విజయేంద్ర ఎన్నో కుట్రలు పన్నారని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే యత్నాల్ ఆరోపించడం కలకలం రేపింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర లింగాయత్ వర్గానికి ముల్లు లాగాతయారైనాడని, ఇలాగే ఉంటే కర్ణాటక బీజేపీని ఏ దేవుడూ రక్షించలేడని యత్నాల్ ఆరోపించారు. పంచమసాలీ వర్గాన్ని కేటగిరీ 2ఏలో చేర్చడాన్ని వ్యతిరేకించింది మొదట బీఎస్‌. యడ్యూరప్ప అని బీజేపీ లీడర్ బసవనగౌడ పాటిల్ యత్నాల్‌ త్వరలో బీజేపీ పూర్తిగా మునిగిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 BJP MLA Basavanagowda Patil Yatnal is making sensational allegations targeting BY Vijayendra

బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ చేస్తున్న ఆరోపణలు ముందు పెట్టుకుని బీజేపీని మరింత ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ నాయకులు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో సహ అందరి మీద బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్ విషయంలో బీజేపీ హైకమాండ్ ఆచితూచి ఆలోచిస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+