చేతిలో గన్‌లు.. మందేసి చిందేసిన బీజేపీ ఎమ్మెల్యే.. (వీడియో)

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. తాగిన మైకంలో చేతిలో గన్‌లు పట్టుకుని ఊగిపోయాడు. ఖాన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన కున్వర్ ప్రణవ్ సింగ్ చేసిన నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెహ్రాడూన్‌లోని ఓ హోటల్‌లో అనుచరులతో కలిసి మందు తాగిన ఆయన మద్యం మత్తులో చిందేశాడు. అంతటితో ఆగకుండా చేతిలో గన్‌లు ప్రదర్శిస్తూ అసభ్యపదజాలం వాడుతూ డ్యాన్స్ చేశాడు.

కొన్నాళ్ల క్రితం కాలికి గాయం కావడంతో కున్వర్ ప్రణవ్ సింగ్ సర్జరీ చేయించుకున్నాడు. ఇటీవలే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సందర్భంగా తన అనుయాయులకు పార్టీ ఇచ్చిన ఆయన వారితో కలిసి వేడుక చేసుకున్నారు. చేతిలో మూడు నాలుగు గన్‌లు పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఊగిపోతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

BJP MLA dances to Karan Arjun songs with guns in hand

ప్రణవ్ సింగ్‌కు ఇలాంటివి కొత్తేమీ కాదు. గతంలో అనేక వివాదాల్లో చిక్కుకున్న ఆయన మూడుసార్లు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. కొన్ని నెలల క్రితం జర్నలిస్టును చంపేస్తానంటూ బెదిరించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తాజా వివాదంపై బీజేపీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రణవ్‌పై త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+