పవన్ కల్యాణ్ పార్ట్ నర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు: జుట్టుకు రంగేసుకుని యంగ్ గా ఉన్నానంటే ఎలా

లక్నో: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పొలిటికల్ పార్ట్ నర్ పై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సురేంద్ర నారాయణ్ సింగ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఆమే- ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత్రి మాయావతి. మాయావతి అందాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు సురేంద్ర నారాయణ్ సింగ్. 60 ఏళ్లొచ్చినప్పటికీ.. మాయావతి నెత్తి మీద జుట్టు మాత్రం నల్లగా నిగనిగలాడుతోందని, ఇది ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. ఈ వయస్సులోనూ ఆమె జుట్టుకు రంగేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ.. బీఎస్పీ చీఫ్ మాయావతితో పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. బీఎస్పీకి మూడు లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది జనసేన పార్టీ.

BJP MLA satirical critics on BSP Chief Mayavati

మంగళవారం లక్నోలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటైన పార్టీ పదాధికారుల సమావేశం అనంతరం- సురేంద్ర నారాయణ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మాయావతి ఇప్పటికీ తాను యవ్వనంలో ఉన్నానని భ్రమపడుతున్నారని అన్నారు. ప్రతిరోజూ ఆమె ఫేషియల్ చేసుకుంటారని చురకలు అంటించారు. బీజేపీ నాయకులు అందంగా ఉన్నారంటూ మాయావతి చేసిన కామెంట్లను ఆయన తిప్పి కొట్టారు. రోజూ ఫేషియల్ చేసుకుని, జుట్టు నల్లరంగు వేసుకున్న మాత్రానా వయస్సు తగ్గిపోదని అన్నారు. జుట్టుకు నల్లరంగు వేసుకుని, తాను యవ్వనంలో ఉన్నట్లు భ్రమపడితే ఎలా? అని ప్రశ్నించారు. 60 ఏళ్ల వయస్సులోనూ జుట్టు పండిపోకుండా ఎలా నల్లగా ఉన్నాయని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+