కాషాయ దుస్తుల్లో అసెంబ్లీకి ఎమ్మెల్యేలు: బీజేపీలో ఫుల్ జోష్
రాంచీ: నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన ఘన విజయం- ఆ పార్టీలో జోష్ నింపింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం పట్ల కమలనాథుల్లో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తోన్నాయి. దేశవ్యాప్తంగా విజయోత్సవ వేడుకలను జరుపుకొంటోన్నారు. గెలిచిన నాలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయాత్తమౌతోన్నారు. దీనికి అవసరమైన చర్యలను తీసుకుంటోన్నారు.
పార్టీ విజయం పట్ల జార్ఖండ్ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించారు. రాంచీలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రదర్శనను చేపట్టారు. వందలాది మంది కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫొటోలను ముద్రించిన బ్యానర్లు నగరం నలువైపులా కట్టారు. రాంచీని కాషాయమయం చేశారు.

బీజేపీ శాసన సభ్యులు మరో అడుగు ముందుకేశారు. తాము కూడా కాషాయ దుస్తులను ధరించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. నరేంద్ర మోడీ, అమిత్ షాలకు జిందాబాద్ కొట్టారు. జార్ఖండ్‌లో బీజేపీ ప్రతిపక్ష స్థానంలో ఉంది. 2019లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ జార్ఖండ్ ముక్తిమోర్చా అధికారంలోకి వచ్చింది. జేఎంఎం-30, కాంగ్రెస్-18 మంది సభ్యులు ఉన్నారు. ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఐ (ఎంఎల్)తో కలిసి జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Recommended Video
బీజేపీకి జార్ఖండ్ అసెంబ్లీలో 26 మంది శాసన సభ్యులు ఉన్నారు. వారంతా కాషాయ దుస్తులను ధరించి సభకు హాజరయ్యారు. సభ ప్రాంగణంలో మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ హవా వీస్తోందని, తమ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామంటూ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. మోడీ- అమిత్ షా జోడీతో దేశం శక్తిమంతగా ఎదుగుతుందని బీజేపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications