Parliament special sessions: ఫొటో సెషన్‍లో కుప్పకూలిపోయిన ఎంపీ..
ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెట్టే ముందు అందరు ఎంపీలు పాత పార్లమెంట్ భవనం వద్దకు వచ్చారు. ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్ ఫొటో దిగారు. వారంతా దీనికోసం మంగళవారం ఉదయం పాత పార్లమెంట్ ప్రాంగణానికి విచ్చేశారు. మొదట ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్ ఫొటోకు దిగారు. తర్వాత రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు విడివిడిగా ఫొటోలకు పోజులిస్చారు. గ్రూప్ ఫొటోలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్రమోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ముందు వరుసలో కూర్చున్నారు.
ఈ ఫొటో సెషన్ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ నరహరి అమీన్ స్పృహ తప్పి పడిపోయారు. ఎంపీ కుప్పకూలిన వెంటనే, ఇతర పార్లమెంట్ సభ్యులు ఆయన్ను పైకి లేపారు. ఆయనకు నీరు అందించారు. ఆ తర్వాత నరహరి కోలుకుని ఫొటో సెషన్ లో పాల్గొన్నారు. అయిత్ 5 నిమిషాల పాటు అందులు ఆందోళనకు గురయ్యారు. సెప్టెంబర్ 18న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పార్లమెంటు కొత్త భవనాన్ని భారత పార్లమెంటు భవనంగా గుర్తించనున్నట్లు తెలిపింది.

ఫొటో సెషన్ తర్వాత లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాత పార్లమెంట్ భవనంలోని చారిత్రాత్మక సెంట్రల్ హాల్‌లో సమావేశమయ్యారు. గొప్ప వారసత్వాన్ని స్మరించుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. సోమవారం పాత భవనంలో ఉభయ సభల చివరి సమావేశాన్ని కూడా ఈ కార్యక్రమం గుర్తుచేస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. కొత్త భవనం ఇప్పుడు పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియాగా గుర్తించబందన్నారు.
#WATCH | BJP MP Narhari Amin fainted during the group photo session of Parliamentarians. He has now recovered and is a part of the photo session. pic.twitter.com/goeqh9JxGN
— ANI (@ANI) September 19, 2023
బ్రిటన్ నుంచి భారత్‌కు అధికార బదలాయింపునకు సెంట్రల్ హాల్ సాక్షిగా నిలిచిందన్నారు. మా పార్లమెంటరీ ప్రయాణం అద్భుతమైన విజయాలు, కష్టమైన సవాళ్లు, అద్భుతమైన మైలురాళ్లతో గుర్తించబడిందని జోషి అన్నారు. దేశ 'సంపన్నమైన పార్లమెంటరీ వారసత్వం'ను పురస్కరించుకుని పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్‌లో సమావేశమైన ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. 1952 నుంచి ప్రపంచవ్యాప్తంగా 41 రాష్ట్రాల అధినేతలు సెంట్రల్ హాల్‌లో మా ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.












Click it and Unblock the Notifications