Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంపీ కొడుకా మజాకా.. కారులో రయ్ రయ్.. క్లబ్ గోడను ఢీ.. గజగజ వణికిన స్థానికులు

కోల్‌కతా : ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ రూప గంగూలీ కుమారుడు ఆకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి సమీపంలో ఓ క్లబ్ గోడను కారుతో ఢీకొట్టాడు ఆకాశ్. ఈ ప్రమాదంలో ఆకాశ్ స్వల్ప గాయాలతో బయటపడగా .. అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గురువారం రాత్రి ఆకాశ్ ముఖర్జీ తన ఇంటికి వెళ్తున్నాడు. అయితే కారు అదుపుతప్పి కోల్‌కతా క్లబ్ గోడను ఢీ కొట్టాడు. దీంతో కారు ముందుభాగం దెబ్బతింది.

ఊపిరిపీల్చుకున్న స్థానికులు

ఊపిరిపీల్చుకున్న స్థానికులు

కారు ప్రమాదం గురించి తెలుసుకున్న అతని తండ్రి ఆకాశ్‌ను బయటకుతీశారు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. కానీ ప్రమాదం నుంచి చాలామంది బయటపడ్డారు. కారు ప్రమాదం నుంచి తప్పించుకొని ఊపిరి పీల్చుకున్నారు. నిన్న రాత్రి 9.15 గంటలకు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. రాయల్ కోల్ కతా గోల్ప్ క్లబ్ గోడను ఢీ కొట్టడంతో కారు ముందుభాగం దెబ్బతింది. కారు అద్దం పగిలిపోయింది.

తల్లి కారులో రయ్ రయ్

తల్లి కారులో రయ్ రయ్

కారు ముందుభాగంలో ఎంపీ స్టిక్కర్ ఉంది. విషయం తెలుసుకొని జాదవ్ పూర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసి .. ఆస్తులను ధ్వంసం చేసిన ఆకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆకాశ్ తాగి ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆకాశ్ శరీరం నుంచి రక్తం సేకరించామని .. పరీక్ష ద్వారా అతను మద్యం సేవించాడనే అంశం తేలుతుందన్నారు. దీంతోపాటు కారును కూడా ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపించినట్టు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కారు ఎంత స్పీడ్ ఉందో నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు. నిన్న ఆకాశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు .. శుక్రవారం అలిపూర్ కోర్టులో ప్రవేశపెడతారు.

ఎందుకీ రాజకీయం

కారు ప్రమాదంపై బీజేపీ ఎంపీ రూప గంగూలి స్పందించారు. తన కుమారుడు ఉదయం ఇంటి నుంచి బయటకెళ్లాడని పేర్కొన్నారు. రాత్రి యాక్సిడెంట్ అయ్యిందని సమాచారం అందిందని తెలిపారు. ప్రమాదం గురించి తెలిసి తానే పోలీసులకు ఫోన్ చేశానన్నారు. అతనిని అదుపులోకి తీసుకోవాలని కోరానని చెప్పారు. తన కుమారుడంటే తనకు ఇష్టమని .. కానీ చట్టం తన పని తాను చేసుకెళ్తుందని ఉద్ఘాటించారు. ఇతర పార్టీలు కూడా రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+