అమ్మాయిపై దాడి: బిజెపి ఎంపి తనయుడి అరెస్టు

బిజెపి ఎంపి కుమారుడు ముత్తు సన్నా ఫకీరప్పను బుధవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మిగతా నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిని డిసెంబర్ 30వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. అమ్మాయి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తమ కూతురు ఒంటరిగా ఉన్న సమయంలో ముత్తు, అతని అనుచురులు ఫోర్ట్ ఏరియాలో ఉన్న ఇంట్లోకి చొరబడ్డారని, తన కూతురిని కొట్టడం ప్రారంభించారని అమ్మాయి తల్లి ఆరోపించింది. తమ కూతురు వ్యభిచారం చేస్తున్నట్లు వారు ఆరోపిస్తూ దాడి చేశారని ఆమె చెప్పింది.
ఓ పుస్తకం కోసం వచ్చిన అబ్బాయిని కూడా ముత్తు, అతని అనుచరులు తోసేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.












Click it and Unblock the Notifications