కమలానికి భార్య టాటా.. ఆమెకు అతను బైబై.. సుజాతకు సౌమిత్ర విడాకుల నోటీసు..
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్నాయి. టీఎంసీ-బీజేపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ లోపు చేరికలు కూడా జోరుగా జరుగుతున్నాయి. బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మోండల్ ఖాన్.. బీజేపీని వీడి టీఎంసీలో చేరారు. తన భార్య పార్టీ వీడటంతో సౌమిత్ర ఖాన్ కూడా కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆయన భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
ఆమెతో తనకు ఉన్న వివాహా బంధం తెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. డైవర్స్ నోటీసు కూడా పంపించారు. ఆమె టీఎంసీలో చేరిన వెంటనే నోటీసులు సెండ్స్ చేశారు. అంతేకాదు బిష్ణుపూర్‌లో గల బర్జొరా వద్ద గల సుజాత ఇంటి వద్ద కారు, సెక్యూరిటీని కూడా తొలగించారు.

పార్టీ వీడటంపై సుజాత స్పందించారు. బీజేపీలో తనకు తగిన గౌరవం లభించలేదని తెలిపారు. ఆ పార్టీలో అవకాశవాదులు, నేరచరిత్ర ఉన్నవారే ఉన్నారని చెప్పారు. వారిని ఎలా మంచిగా మారుస్తారో అర్థం కావడం లేదు. వారిని స్వచ్చంగా మార్చేందుకు ఏ సబ్బు వాడతారో తెలియడం లేదన్నారు. గత ఎన్నికల్లో తన భర్త, తాను ఎంపీలుగా గెలిచామని తెలిపారు.
Recommended Video
పశ్చిమ బెంగాల్ బీజేపీలో ఆరుగురు సీఎం అభ్యర్థులు, 13 మంది డిప్యూటీలు ఉన్నారని సుజాత తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ప్రధాని అని సీఎం కాదన్నారు. అయితే నాయకత్వం గురించి ప్రశ్నిస్తే తగిన సమాధానం లేదని చెప్పారు. అక్కడ బీజేపీకి సరైన నేత లేరు అని తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications