వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి ఫ్రెండ్ శ్రీరాములు ప్యాలెస్ (ఇల్లు) ఇదే (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

బళ్లారి: బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు ఇల్లు కళ్లు చెదిరేలా ఉంది. బళ్లారీలో నిర్మించిన ఈ ఇంటికి ఆయన అరుణ గార్డెన్స్ అనే పేరు పెట్టారు.

ఇటీవలే తన ప్రాణ స్నేహితుడు గాలి జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా ఇంటి గృహప్రవేశం చేసిన శ్రీరాములు కొంత ఇంటిలోకి మారారు. శ్రీరాములు ఇల్లు చూసిన ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు చాల బాగుంది అన్నా అంటున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి ఏర్పాట్ల కోసం బళ్లారి వెళ్లారు. అదే సమయంలో తన ప్రాణ స్నేహితుడు శ్రీరాములు ఇంటి గృహప్రవేశ శుభకార్యంలో పాల్గోన్నారు. స్వయంగా గాలి జనార్దన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి శ్రీరాములును కొత్త ఇంటిలోకి పంపించారు.

చాల సంతోషంగా ఉంది: గాలి

చాల సంతోషంగా ఉంది: గాలి

శ్రీరాములు ఇంటి గృహప్రవేశ శుభకార్యంలో పాల్గోన్న గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నాకోసం ఇంత కాలం వేచి చూసి నేను వచ్చిన తరువాత కొత్త ఇంటిలోకి వెలుతున్న శ్రీరాములుకు అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. తన కోసం ఇన్ని సంవత్సరాలు వేచి చూడటం ఆనందంగా ఉందని చెప్పారు.

స్నేహం కోసం శ్రీరాములు

స్నేహం కోసం శ్రీరాములు

బళ్లారిలోని సిరుగుప్ప రోడ్డులోని అవంబాయి సమీపంలో సుమారు ఒకటిన్నర ఎకరా స్థలంలో శ్రీరాములు తన ఇంటిని నిర్మించారు. 2008లో ఈ ఇంటిని నిర్మించడానికి భూమి పూజ చేశారు. ఇల్లు పూర్తి అయ్యి చాల కాలం అయ్యింది. అయితే తన ప్రాణ స్నేహితుడు లేకుండా తాను కొత్త ఇంటిలోకి వెళ్లనని చెప్పిన శ్రీరాములు ఇంత కాలం వేచి చూశారు.

కుమార్తె పెళ్లి కోసం వస్తారని

కుమార్తె పెళ్లి కోసం వస్తారని

గాలి కుమార్తె వివాహం నిశ్చయం అయిన తరువాత శ్రీరాములు మంచి రోజు చూసి గృహప్రవేశ శుభకార్యం పెట్టుకున్నారు. దేవుడు, వాస్తు మీద ఎక్కువ నమ్మకం ఉన్న శ్రీరాములు ఆంధ్రప్రదేశ్, చిక్కమగళూరు, కేరళ, తమిళనాడు నుంచి జోతిష్యులను గృహప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానించారు.

ముంబై డెకరేటర్స్

ముంబై డెకరేటర్స్

ముంబైకి చెందిన డెకరేటర్స్ శ్రీరాములు ఇంటిని చక్కగా తీర్చిదిద్దారు. బహుళ అంతస్తుల ఈ భవనం ఆవరణంలో స్విమ్మింగ్ పూల్, బోన్సాయ్ గార్డెన్, సినిమా థియేటర్, పార్క్, దేవుడి గుడి, డైనింగ్ హాల్, వంటగది ఉంది. మొదటి అంతస్తులోకి నేరుగా కారు వెళ్లడానికి సౌకర్యం, కార్యాలయం, ఆరు విశాలమైన గదులు ఉండే విధంగా నిర్మించారు.

అంతా పోయినప్పుడు

అంతా పోయినప్పుడు

గతంలో బీజేపీకి రాజీనామా చేసిన శ్రీరాములు బీఎస్ఆర్ పార్టీని స్థాపించారు. కర్ణాటకలో దాదాపు అన్ని నియోజక వర్గాల నుంచి బీఎస్ఆర్ పార్టీ నుంచి అభ్యర్థులను శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయించారు. ఆ సమయంలో ఆయన పార్టీని నడిపిస్తూ ఆర్థికంగా నష్టపోయారని సమాచారం.

శ్రీరాములు ఇల్లు

శ్రీరాములు ఇల్లు

శ్రీరాములు ఇల్లు సూపర్ గా ఉందని బళ్లారీ ప్రజలు అంటున్నారు. ఆయన సుమారు రూ. 50 కోట్ల వ్యయంతో కొత్త ఇంటిని నిర్మించారని సమాచారం. ఈ ఇల్లు చూసిన వారు అది ఓ పెద్ద ప్యాలెస్ లాగా ఉందని అంటున్నారు. మొత్తం మీద కొత్త ఇంటిలోకి వెళ్లిన శ్రీరాములుకు అంతా శుభం జరగాలని ఆయన అనుచరులు అంటున్నారు.

English summary
B. Sriramulu, BJP MP recently inaugurated bungalow in Ballary. Construction cost estimated 50 crore, Ex minister, Sriramulu friend Janardhana reddy inaugurated the bungalow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X