రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరుగుతాయట.. బాగోలేని రోడ్లతోనే మేలు.. బీజేపీ ఎంపీ నోటి దూల...
రోడ్డు ప్రమాదాల తగ్గాలంటే ఏం చేయాలి. వాహనదారులకు అవగాహన కల్పించాలి. మంచి రోడ్లను ఏర్పాటు చేయాలి. తదితర సూచనలు చేస్తాం. కానీ ఓ ప్రజా ప్రతినిధి మాత్రం రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు జరుగుతున్నాయని సెలవిచ్చారు. అందుకే యువత మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్లు బాగోలేకుంటే అందరూ మెల్లగా వెళతారు కదా అని కొత్త నీతి చెప్పుకొచ్చారు.

నోటి దూల...
ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి, ఆలోచినా విధానం. ప్రతీ ఇద్దరిలో అభిప్రాయబేధాలు ఉంటాయి. ఇది సహజ లక్షణమే. కానీ అసోంకి చెందిన బీజేపీ ఎంపీ పల్లాబ్ లోచన్ దాస్ మాత్రం తన నోటి దూలను బయటపెట్టారు. అవును రోడ్డు ప్రమాదాలపై శాస్త్రవేత్తల థియరీ బయటపెట్టి విమర్శలపాలవుతున్నారు.

మంచి రోడ్లు వద్దుట..
తేజ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో లోచన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచి రహదారుల అంశం టాపిక్ వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. మంచి రోడ్లు ఉంటేనే ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు రోడ్లు బాగుంటే యువత ఎక్కువ స్పీడులో వెళుతున్నారు. అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయి అని తర్కాన్ని బయటపెట్టారు. అదే రోడ్లు బాగాలేకుంటే ప్రమాదాలు జరుగుతాయా అని ఎదురు ప్రశ్నించారు.

బాగుంటే స్పీడ్..
రోడ్లు బాగోలేకుంటే స్పీడ్ వెళ్లరని చెప్పారు. ఆయా రోడ్లపై స్పీడుగా వెళ్లడం సాధ్యపడదని చెప్పారు. ఒకవేళ సాహసించి స్పీడ్ వెళ్లాలని చూస్తే వారి వాహనమే రిపేర్‌కు వస్తోందని చెప్పారు. దీంతో వారు వేగంగా వెళ్లే సాహసం చేయరని చెప్పారు. మంచి రోడ్లు కాదు.. బాగోలేనే రోడ్ల వల్లే ప్రమాదాలు జరగవని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని చెప్పారు.

ప్రమాదాలకే కారణమిదే..
అసోంలో రహదారుల అభివృద్ధి జరిగిందని లోచన్ పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాదాలు పెరగడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో మంచి రోడ్లు ఉండటమేనని చెప్పారు. అయితే లోచన్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి బాధ్యతారహిత్యంగా మాట్లాడటం ఏంటి అని మండిపడుతున్నారు. లోచన్ వైఖరి సరికాదని విరుచుకుపడుతున్నారు.
-
ఎంపీ రాఘవ్ చడ్డాకు బిగ్ షాక్.. సెక్యూరిటీని తొలగింపు ?? -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications