వైనాట్ 400: రోడ్ మ్యాప్‌పై బీజేపీ కసరత్తు

BJP National council meeting: లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించి ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో భారతీయ జనత పార్టీ.. కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించడానికి అవసరమైన అజెండాను ఖరారు చేయనుంది.

దేశ రాజధాని వేదికగా నేడు, రేపు జాతీయ కార్యవర్గ సమావేశాలను ఏర్పాటు చేసింది బీజేపీ. అన్ని రాష్ట్రాల నుంచి కార్యదర్శులు, పదాధికారులు ఇందులో పాల్గొననున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్ర శాఖ అధ్యక్షులు దీనికి హాజరుకానున్నారు. ఢిల్లీలోని భారత్ మండప్.. దీనికి వేదిక.

BJP National council meeting to decide an agenda for Lok Sabha elections 2024

ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. పార్టీకి దిశానిర్దేశం చేస్తారు. ఇదే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానమంత్రి అభ్యర్థినీ ఖరారు చేస్తుంది బీజేపీ. తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా మూడోసారి మోదీ ఎంపిక కావడం లాంఛనప్రాయమే.

వచ్చే ఎన్నికల్లో 400 లోక్‌సభ స్థానాలను గెలవాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇదే విషయాన్ని ఇటీవలే ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కనీసం 40 స్థానాలనైనా గెలుచుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు.

ఇప్పుడిదే లక్ష్యాన్ని అందుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ దృష్టి సారించనుంది. దీనికోసం ఎన్నికల హామీలు ఎలా ఉండాలనే విషయంపై చర్చిస్తుంది. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తులపైనా ఈ కన్వెన్షన్‌లో ప్రస్తావనకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+