వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబ్బ.. అమీత్ షా వ్యూహంలో ఉన్న కిక్కే వేరబ్బ..! ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే అద్యక్ష మార్పు..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : అమీత్ షా తన అద్యక్ష పదవి ఒదులుకునేందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నాయ‌క‌త్వంలో ఇప్పుడ‌ప్పుడే మార్పు జ‌రిగేలా క‌నిపించ‌డం లేదు. ఈ ఏడాది ఆఖ‌రు వ‌ర‌కు అమిత్ షానే బీజేపీ అధ్యక్ష బాధ్య‌త‌లు నిర్విర్తించనున్నట్టు సమాచారం. వాస్త‌వానికి ఆయ‌న ప‌ద‌వికాలం గ‌తేడాది డిసెంబ‌రుతోనే ముగిసింది. అయితే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు అధ్య‌క్షుడ్ని మార్చ‌డం ఇబ్బందిక‌రమ‌ని భావించి అమిత్ షానే పార్టీ కొన‌సాగించింది.

గవర్నర్‌ ప్రసంగమా..? వైసీపి కరపత్రమా..? మండిపడ్డ టీడిపి నేతలు... !! గవర్నర్‌ ప్రసంగమా..? వైసీపి కరపత్రమా..? మండిపడ్డ టీడిపి నేతలు... !!

మోడీ, అమిత్ షా నాయ‌క‌త్వంలో ఎన్నిక‌ల‌కు వెళ్లిన బీజేపీ అద్భుత విజ‌యాన్ని అందుకుంది. క‌నీవినీ ఎరుగ‌ని విధంగా రెండోసారి సొంత‌గా మెజార్టీ సాధించ‌డంతోపాటు 300కుపై ఎంపీ సీట్లు సాధించింది. ఎన్నిక‌లలో ఎంపీగా గెలిచిన బీజేపీ అద్య‌క్షుడు అమిత్ షా మోడీ ప్ర‌భుత్వంలో చేరారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టారు. దీంతో బీజేపీ నిబంధ‌న‌ల ప్ర‌కారం జోడు ప‌ద‌వులు అనుభ‌వించ‌డానికి వీల్లేకపోవ‌డంతో ఆయ‌న త‌ప్పుకుని మ‌రొక‌రికి అవ‌కాశం ఇస్తార‌ని భావించారు.

bjp national president selection.!After the 4 states elections Only..!!

బీజేపీ అధ్య‌క్ష రేసులో జేపీ న‌డ్డా, రామ్‌మాధ‌వ్ పేర్లు వినిపించాయి. అయితే.. అనూహ్యంగా అమిత్‌షా నే మ‌రో ఆరు నెల‌లు ఆ ప‌ద‌విలో కొన‌సాగాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. ఈ ఏడాది చివ‌ర్లో మూడు కీల‌క రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గబోతున్నాయి. మ‌హారాష్ట్ర, హ‌ర్యానా, జార్ఖండ్‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. వీటితోపాటు జ‌మ్మూక‌శ్మీర్‌లోనూ ఎన్నిక‌లు జ‌రిగే వీలుంది. ఈ ఎన్నిక‌లు బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. అందుకే అమిత్ షా నేతృత్వంలోనే ఈ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని బీజేపీ నిర్ణ‌యించింది. ఆయ‌న్నే ఈ ఏడాది డిసెంబ‌రు వ‌ర‌కు పార్టీ అధ్య‌క్షుడిగా కొన‌సాగాల‌ని తీర్మానించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో పాగా వేసి పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవాల‌ని షా యోచిస్తున్నారు. ఈలోపు సంస్థాగ‌త ఎన్నిక‌లు ప్రారంభించి.. డిసెంబ‌రులోపు పూర్తి చేసి.. ఆ త‌ర్వాత జాతీయ అధ్య‌క్షుడిని ఎన్నుకోవాల‌ని బీజేపీ నిర్ణ‌యించింది. దీంతో అద్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న వారు మరి కొద్ది నెలలు వేచి చూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

English summary
Amit Shah has decided to continue for another six months. By the end of this year, elections will be going to three key states. Elections are held in Maharashtra, Haryana and Jharkhand. Apart from these, elections will be held in Jammu and Kashmir. These elections have become the BJP's prestige. That is why the BJP decided to go to the polls with Amit Shah. He decided to continue as party president until December this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X