వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ లో బీజేపీ రాజకీయం-దివంగత అహ్మద్ పటేల్ తో తీస్తా లింకులు ? సోనియా కుట్రంటూ..

గుజరాత్ లో బీజేపీ రాజకీయం-దివంగత అహ్మద్ పటేల్ తో తీస్తా లింకులు ? సోనియా కుట్రంటూ..

|
Google Oneindia TeluguNews

గుజరాత్ లో 2002లో చోటుచేసుకున్న అల్లర్ల సమయంలో అక్కడ నరేంద్రమోడీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో ఈ అల్లర్లను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ, ఇంకా చెప్పాలంటే ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహించిందంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిపై అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ సిట్ విచారణలు చేయించి క్లీన్ చిట్ తీసుకుంది. దీన్ని చివరికి తాజాగా సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది.ఈ నేపథ్యంలో అప్పుడు తమపై కేసులు పెట్టి న్యాయపోరాటం చేసిన వారిని బీజేపీ టార్గెట్ చేస్తోంది.

 గుజరాత్ లో బీజేపీ కక్ష రాజకీయం

గుజరాత్ లో బీజేపీ కక్ష రాజకీయం

గుజరాత్ లో 2002లో చోటు చేసుకున్న మత ఘర్షణల్లో తన భర్తను కోల్పోయిన భార్య అప్పటి అల్లర్లపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడి విఫలమైంది. అంతకుముందే నరేంద్రమోడీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వానికి సిట్ ఇచ్చిన క్లీన్ చిట్ ను సుప్రీంకోర్టు తాజాగా సమర్ధించడంతో ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం కక్షారాజకీయాలు మొదలుపెట్టేసింది. అప్పట్లో తమతో పోరాడిన వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతోంది. ఇదే క్రమంలో ఏఐఎస్ అధికారి సంజీవ్ భట్, మాజీ డీజీపీ శ్రీవాస్తవతో పాటు సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ఇప్పటికే జైళ్లకు వెళ్లారు.

దివంగత అహ్మద్ పటేల్ తోనూ రాజకీయం

దివంగత అహ్మద్ పటేల్ తోనూ రాజకీయం

ఇదే క్రమంలో బీజేపీ సర్కార్ అక్కడ కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ ను కూడా ఈ వివాదంలోకి లాగింది. అహ్మద్ పటేల్ రచించిన కుట్రలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ పాలుపంచుకున్నారంటూ తాజాగా ఆమె బెయిల్ అడ్డుకుంటూ గుజరాత్ పోలీసులు చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. మరీ చనిపోయిన అహ్మద్ పటేల్ నూ ఇందులోకి లాగాలా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా గుజరాత్ పోలీసులు మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇదే క్రమంలో బీజేపీ నేతలు మరో అడుగు ముందుకేసి అప్పటి కుట్రకు సూత్రధారి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీయే నంటూ ఆరోపణలు మొదలుపెట్టారు. గుజరాత్ లో మోడీ సర్కార్ ను కూల్చేందుకు ఈ కుట్ర పన్నారంటూ బీజేపీ ఆరోపిస్తోంది.

 దుర్మార్గపు ఆరోపణలన్న కాంగ్రెస్

దుర్మార్గపు ఆరోపణలన్న కాంగ్రెస్

కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్‌పై గుజరాత్ పోలీసులు చేసిన ఆరోపణలను "దుర్మార్గం", సొంత తయారీ ఆరోపణలని కాంగ్రెస్ ఫైర్ అయింది. 2002లో గుజరాత్‌లో జరిగిన మత మారణహోమానికి బాధ్యత వహించకుండా తప్పించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ పన్నిన "క్రమబద్ధమైన వ్యూహం" ఈ కుట్ర అభియోగమని బిజెపిపై నిప్పులు చెరిగింది. ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటిషన్‌ను గుజరాత్ పోలీసులు వ్యతిరేకించడంతో కాంగ్రెస్
దీనిపై స్పందించింది. సెషన్స్ కోర్టు ముందు అఫిడవిట్‌లో, 2002 అల్లర్ల తర్వాత రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడానికి అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకు జరిగిన "పెద్ద కుట్ర"లో ఆమె భాగమని సిట్ పేర్కొంది.

English summary
after gujarat police allegations of conspiracy against narendra modi govt in 2002 riots, bjp begins attack on congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X