మోదీ వ్యూహం, అసలు కర్త యోగీ - బీజేపీ మిషన్ అయోధ్య..!!

దేశ మొత్తం ఇప్పుడు అయోధ్య వైపు చూస్తోంది. ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. శతాబ్దాల కల ఇప్పుడు సాకారమైంది. రామ మందిరం ప్రారంభోత్సవంలో ప్రధాన కర్తగా ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. కానీ, సుప్రీం తీర్పు వచ్చిన నాటి నుంచి నేటి వరకు మోదీ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. మోదీ వ్యూహాలు రచిస్తే..వాటిని పక్కాగా అమలు చేయటంలో యూపీ సీఎం యోగీ సక్సెస్ అయ్యారు. రామాలయం భూమి పూజ చేసిన నాటి నుంచి నేటి ప్రారంభోత్సవం వరకు యోగీదే కీలకపాత్ర.

బీజేపీ - అయోధ్య: రామజన్మభూమి అంశం బీజేపీకి రాజకీయంగా ఎదగటంలో సహకరించింది. ఇక, దశబ్దాల కల అయిన రామ మందిరం నిర్మాణంలో అనేక కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. 1984 ఎన్నికల్లో బీజేపీ తొలిగా గెలిచింది 2 స్థానాలు. ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 414 సీట్లను గెలుచుకుంది.

BJP Plans to reach out to crores of people with “Mission Ayodhya” eye on 400 seats in 2024

1989లో పాలంపూర్ లో అయోధ్య రామమందిరం నిర్మాణానికి కట్టుబడి ఉంటామని బీజేపీ ప్రకటించింది. దీంతో అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 85 స్థానాలు దక్కించుకుంది. 1990లో అద్వానీ సోమ్ నాధ్ ఆలయం నుంచి రధయాత్ర ప్రారంభించారు. బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఈ యాత్ర ఒక కీలక మలుపు. 1991లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 121 సీట్లను కైవసం చేసుకుంది.

మోదీ చెప్పారు - యోగీ చేసారు: 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. 1996 ఎన్నికల్లో బీజేపీ 161 స్థానాలు గెలిచి అతి పెద్ద పార్టీగా నిలిచింది. కానీ, రెండు వారాల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. 1998ల ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లతో మరోసారి అతిపెద్ద పార్టీగా నిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినా ప్రభుత్వం ఎక్కవ కాలం కొనసాగలేదు.

1999-2004 వరకు వాజ్ పేయ్ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగినా అయోధ్య, కామన్ సివిల్ కోడ్ వంటి అంశాలను పక్కన పెట్టింది. మోదీ ప్రధాని అభ్యర్దిగా ప్రకటన తరువాత హిందుత్వ తిరిగి బీజేపీ అజెండాగా మారింది. 2014 ఎన్నికల్లో 282, 2019లో బీజేపీ 303 సీట్లు సాధించింది. 2024లో హ్యాట్రిక్ పైన మోదీ గురి పెట్టారు. కాశ్మీర్, అయోధ్య అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సుప్రీం తీర్పుతో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

BJP Plans to reach out to crores of people with “Mission Ayodhya” eye on 400 seats in 2024

బీజేపీ మిషన్ అయోధ్య: 2024 ఎన్నికల్లో 400 సీట్లతో హ్యాట్రిక్ విజయం సాధించాలనేది మోదీ లక్ష్యం. అందులో భాగంగా రామ మందిరం అంశాన్ని అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ఇక్కడ తెర పైన మోదీ ప్రధానంగా కనిపిస్తున్నా.. భూమిపూజ నుంచి నేడు ప్రారంభోత్సవం వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ అన్నీ తానై ఈ కార్యక్రమాన్ని తన భుజాలపైన వేసుకున్నది యూపీ సీఎం యోగీ.

ఆహ్వానాలు, బందోబస్తు, భక్తులకు ఏర్పాట్లు ఇలా ప్రతీ అంశం తానే సమీక్షించారు. గతంలో ఏ ఆలయం ప్రారంభోత్సవానికి దక్కని ప్రచారం.. ఈ స్థాయి ఆధ్మాత్మిక శోభకు కారణంగా స్థానిక యోగీ ప్రభుత్వం. వివాదాలకు దూరంగా ఉంటూ...మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవటంలో సీఎం యోగీ కీలక పాత్ర పోషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+