వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా, రాహుల్, ప్రియాంక వ్యాక్సీన్ తీసుకున్నారా....ప్రశ్నించిన బీజేపీ, స్పందించిన కాంగ్రెస్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కాంగ్రెస్ పార్టీ దేశంలో వ్యాక్సీన్ వ్యతిరేకత సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ విమర్శించింది.

కరోనా వ్యాక్సీన్ విషయంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వ్యాక్సీన్ అందరికీ అందేలా చూస్తూ 'రాజధర్మ'ను పాటించాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సూచించగా, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని బీజేపీ విమర్శించింది.

కాంగ్రెస్‌ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంకలు వ్యాక్సీన్ తీసుకున్నారా అంటూ బీజేపీ నేతలు లేవనెత్తిన సందేహాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ...సోనియా గాంధీ కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నారని వెల్లడించింది.

దేశంలో టీకా కార్యక్రమం అత్యంత వేగంగా నడుస్తోందని బీజేపీ అన్నది.

బీజేపీ ఎందుకు ప్రశ్నించింది?

భారత్ బయోటెక్ తయారు చేసే వ్యాక్సీన్‌లో నవజాత ఆవు దూడ సీరం (బ్లడ్ ప్లాస్మా)ను వాడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడంతో వివాదం మొదలైంది. ఈ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

''మనం ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సీన్ డ్రైవ్ నడుపుతున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో పగలు, రాత్రి శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీకి మాత్రం భారతదేశంలో టీకా ప్రక్రియను ఆపడమే ప్రధాన లక్ష్యం'' అని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు.

ఆవు దూడ ప్లాస్మా వాడకం వివాదంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ''లేగ దూడ ప్లాస్మాను వైరస్ కణాల ఉత్పత్తి, అభివృద్ధికి వాడతారు. ఆవులు, ఇతర జంతువుల నుండి బ్లడ్ ప్లాస్మాను వైరస్ కణాల ఉత్పత్తికి వాడటం ప్రపంచ వ్యాప్తంగా ఉంది'' అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

లేగదూడ సీరం వాడుతున్నారంటూ, అందుకు సాక్ష్యంగా ఆర్టీఐ నుంచి తీసుకున్న సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ నేత గౌరవ్ పాండే బుధవారం ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీనిని రీసెర్చ్ డాక్యుమెంట్‌గా పేర్కొన్నారు.

https://twitter.com/BJP4India/status/1405085249738969091

''ఈ అంశాన్ని లేవనెత్తడం కాంగ్రెస్ అసహన, అహంకార, పాప పూరితమైన ఆలోచనా విధానానికి నిదర్శనం'' అని సంబిత్ పాత్రా విమర్శించారు.

ఇదే సందర్భంలో ఆయన కాంగ్రెస్ నేతలు తీసుకున్నారా లేదా అన్నదానిపై సందేహాలు లేవనెత్తారు. '' అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆమె కుటుంబ సభ్యులు టీకాలు వేసుకున్నారా'' అని సంబిత్ పాత్రా ప్రశ్నించారు.

''భారతీయ జనతా పార్టీ ఈ ప్రశ్నను పూర్తి బాధ్యతతో అడుగుతోంది. గౌరవనీయ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా టీకాలు తీసుకున్నారో లేదో చెప్పాలి. తీసుకుంటే మొదటి డోసు ఎప్పుడు తీసుకున్నారు, రెండో డోసు ఎప్పుడు తీసుకున్నారో వెల్లడించాలి'' అని సంబిత్ పాత్రా ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు దేశంలో వ్యాక్సీన్ వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారని సంబిత్ పాత్రా విమర్శించారు.

సోనియా గాంధీ కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ప్రియాంకా వాద్రా తొలి డోస్ తీసుకున్నారని వెల్లడించింది.

కాంగ్రెస్ సమాధానం

బీజేపీ నుంచి వచ్చిన ఈ ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ సమాధానం ఇచ్చింది. ''కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండు డోసుల కోవిషీల్డ్ తీసుకున్నారు. ప్రియాంక వాద్రా మొదటి డోసు టీకాను తీసుకున్నారు. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత వైద్యుల సలహా మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాక్సీన్ తీసుకుంటారు'' అని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా వెల్లడించారు.

"అర్థరహిత సమస్యలను సృష్టించే బదులు, 2021 డిసెంబర్ 31 నాటికి 100 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సీన్ అందించే లక్ష్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి'' అని సుర్జేవాలా అన్నారు.

కరోనా సెకండ్‌వేవ్‌లో విఫలమైన తరువాత, కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన ఏకైక 'రాజధర్మ' ఇదేనని ఆయన అన్నారు.

ప్రభుత్వానికి కాంగ్రెస్ సవాల్

భారతీయ జనతా పార్టీ నేతలపై విమర్శలు కొనసాగించిన సుర్జేవాలా ''భారత ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండు డోసుల టీకా తీసుకున్నారన్న విషయం తెలిసి ఉండాలి'' అని అన్నారు.

''రాహుల్ గాంధీ 2021 ఏప్రిల్ 16న టీకా తీసుకుందామనుకున్నారు. కానీ, ఆయన కరోనాతో బాధపడ్డారు. ఇప్పుడు వైద్యుల సలహా మేరకు వ్యాక్సీన్ తీసుకుంటారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా మొదటి డోసు తీసుకున్నారు'' అని సుర్జేవాలా స్పష్టం చేశారు.

''భారతదేశంలో టీకా కార్యక్రమ నిర్వహణ లోపాల విషయంలో ప్రధాన మంత్రి మోదీ, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ లే దోషులు'' అని సుర్జేవాలా ఆరోపించారు.

జనవరి 16 నుంచి జూన్ 16 మధ్య ఆరు నెలల్లో భారతదేశ మొత్తం జనాభాలో 3.51 శాతం మందికి మాత్రమే రెండు మోతాదుల వ్యాక్సీన్ అందిందని, ఇది ప్రపంచంలోనే అతి తక్కువ వ్యాక్సినేషన్ రేట్ అని సుర్జేవాలా అన్నారు.

ప్రజలకు టీకాలపై దృష్టి పెట్టకుండా ఆరోగ్య మంత్రి, బీజేపీలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాల టీకాలపై దృష్టి పెడుతున్నారని, తద్వారా సమస్యను నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని సుర్జేవాలా ఆరోపించారు.

2021 డిసెంబర్ కంటే ముందే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావ్‌డేకర్ ఇంతకు ముందే స్పష్టం చేశారు.

విమర్శలు-ప్రతి విమర్శలు

మోదీ ప్రభుత్వ టీకా విధానంపై కాంగ్రెస్ పార్టీ తరచుగా విమర్శలు చేస్తూనే ఉ:ది. వ్యాక్సీన అందుబాటులో లేకపోవడం, వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగడంపై కూడా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పలుమార్లు నిలదీసింది. '' మొదటి వేవ్‌ను అర్ధం చేసుకోలేక పోయాం. బాగానే ఉంది. కానీ, సెకండ్ వేవ్ పాపం మాత్రం ప్రధానమంత్రిదే'' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ''మాస్క్‌లు, సామాజిక దూరాలు, లాక్‌డౌన్‌లు తాత్కాలిక పరిష్కారాలే. వ్యాక్సినేషన్ మాత్రమే శాశ్వతం'' అని రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జావ్‌డేకర్ 2021 డిసెంబర్ చివరి నాటికి భారతదేశంలో వ్యాక్సినేషన్ పూర్తవుతుందని ప్రకటించారు. "భారత దేశంలో టీకాలు వేయడం 2021 డిసెంబరుకి ముందే పూర్తవుతుందని అర్థం చేసుకోవాలి" అని జావ్‌డేకర్ అన్నారు. ఇందుకోసం తమ వద్ద ఒక ప్రణాళిక ఉందని ఆయన స్పష్టం చేశారు.

English summary
BJP questions over Sonia, Rahul, Priyanka vaccination,Congress responds
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X