లాలూ-నితీష్ తిట్లు చూడండి!: బిజెపి 'హైటెక్ వీడియో'

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అత్యధిక ఎమ్మెల్సీలను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ.. తమను దెబ్బతీసేందుకు మిత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్‌లను దెబ్బతీసేందుకు మంచి వ్యూహంతో ముందుకు వెళ్తోంది.

బీహార్ ఎన్నికల్లో నిన్నటి వరకు లాలూ, నితీశ్‌లు బద్ద శత్రువులు. ఇప్పుడు బిజెపిని ఓడించేందుకు వారు ఒక్కటయ్యారు. వారి కలయికపై బీహార్ ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందని అంటున్నారు. దానికి తోడు, ఇటీవల స్థానిక ఎన్నికల్లో బిజెపి విజయ ఢంగా మోగించింది.

BJP’s high-tech ‘rath yatra’: 56-inch screens, old video clips of Lalu, Nitish

ఇప్పుడు బిజెపి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలు, నితీష్‌లను దెబ్బతీసేందుకు వినూత్న రీతిలో ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. గతంలో ప్రత్యర్థులైన లాలు, నితీష్‌లు ఒకరి పైన మరొకరు చేసుకున్న తీవ్ర విమర్శలను, తిట్లను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బిజెపి సిద్ధమైంది.

వీరిద్దరు ఒకరినొకరు తిట్టుకున్న క్లిప్పింగులను ప్రజలకు చూపించనున్నారు. ఇందుకోసం 56 అంగుళాల ఎల్ఈడీ టీవీలు అమర్చిన 160 హైటెక్ ప్రచార రథాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారే చేయిస్తోంది. లాలూ సీఎంగా ఉన్నప్పటి బీహార్ పరిస్థితిని ప్రజల్లోకి తీసుకు వెళ్లనున్నారు. ఇప్పుడు అదే లాలు.. నితీష్‌తో కలవడాన్ని ప్రశ్నించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+