దేశ భద్రతే ముఖ్యం.. అధికారంలో ఉండటం కాదు: ఆలం విడుదలపై రాజ్‌నాథ్
న్యూఢిల్లీ/ఘజియాబాద్: తమకు దేశ భద్రతే ప్రథమ ప్రాధాన్యమని, అధికారంలో ఉండటం కాదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కాశ్మీరీ వేర్పాటువాది మసరత్ ఆలం విడుదల పట్ల దేశ వ్యాప్తంగా వెల్లువెత్తున్న నిరసనల నేపథ్యంలో రాజ్‌నాథ్ పైవిధంగా స్పందించారు.
జమ్మూకాశ్మీర్‌లో పిడిపితో పొత్తు ఉన్నా ఇలాంటి చర్యల్ని తాము సహించబోమని ఆయన చెప్పారు. ఈ విషయంలో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తమను కలచివేసిందని అన్నారు. సమాచారం, అంగీకారం లేకుండా ఆలంను విడుదల చేయడం గర్హనీయమని అన్నారు.

సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు కాశ్మీర్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కంటే దేశ ప్రజల భద్రతే ముఖ్యమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎప్పటికీ సామాజిక భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.
ఇదే విషయాన్ని సోమవారం పార్లమెంట్ లో కూడా చెప్పానని, మరోసారి దానికే కట్టుబడి ఉన్నానని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం బిజెపి-పిడిపిల మధ్య భిన్నమైన వాతావరణం నెలకొనడంతో వారి భాగస్వామ్యం ఐదేళ్ల వరకు కొనసాగుతుందా?అనేది పలు అనుమానాలకు తావిస్తోంది.












Click it and Unblock the Notifications