‘‘ఇంత దిగజారుడు వ్యాఖ్యలా? మీరెన్నిసార్లు అత్యాచారానికి గురయ్యారో చెప్పండి?’’
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ చేసిన వివాదాస్పద 'అత్యాచారం' వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. 'రూపాజీ...బెంగాల్‌లో మీరెన్ని సార్లు అత్యాచారానికి గురయ్యారో చెబితే బాగుంటుంది' అంటూ ఎదురుదా
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ చేసిన వివాదాస్పద 'అత్యాచారం' వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. 'రూపాజీ...బెంగాల్‌లో మీరెన్ని సార్లు అత్యాచారానికి గురయ్యారో చెబితే బాగుంటుంది' అంటూ ఎదురుదాడి చేసింది.
బెంగాల్ హింసాకాండతో అట్టుడుగుతోందని, మమతా బెనర్జీకి, కాంగ్రెస్‌కు వత్తాసు పలుకుతున్న పార్టీలు తమ భార్యలను బెంగాల్‌లో 15 రోజులు ఉంచితే వాళ్లు అత్యాచారానికి గురికాకుండా తిరిగిరాగలరా? అని రూపాగంగూలీ మీడియా ముందు సవాల్ చేశారు.

అలా తిరిగివస్తే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని ఆమె అన్నారు. ఆమె వ్యాఖ్యలను టీఎంసీ మంత్రి సోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ తిప్పికొట్టారు. 'ముందు బెంగాల్‌లో ఆమె ఎన్నిసార్లు అత్యాచారానికి గురయ్యారో చెప్పాలి' అని నిలదీశారు.
'విమర్శలు చేసేటప్పుడు వాస్తవాలు బయటపెట్టాలి. ఆమె ఎన్నిసార్లు బెంగాల్‌లో అత్యాచారానికి గురయ్యారో ముందు చెబితే ఆమె వ్యాఖ్యల్లో నిజం ఎంతో బయటపడుతుంది' అని అన్నారు.
ఎంతటి బుద్ధిమాంద్యం ఉన్న వాళ్లు కూడా తన సొంత రాష్ట్రంపై ఇంతగా దిగజారుడు వ్యాఖ్యలు చేయరని రూపాగంగూలీపై ఛటోపాధ్యాయ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications