అద్భుతం!: వరుణ్ ప్రశంసలు, ఉబ్బితబ్బిబ్బైన రాహుల్

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సుల్తాన్‌పుర పార్లమెంటు సభ్యులు వరుణ్ గాంధీ తన రాజకీయ ప్రత్యర్థి అయిన ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన ప్రశంసల వర్షం కురిపించారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ. దివంగత సంజయ్ గాంధీ తనయుడు వరుణ్ గాంధీ. వీరు ఇరువురు సోదరులు. అయితే, రాజకీయంగా మాత్రం ప్రత్యర్థులు.

రాహుల్ గాంధీ కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షులు కాగా.. వరుణ్ గాంధీ బిజెపి ఎంపీ. అయితే, వరుణ్ తన సోదరుడు.. రాహుల్ పైన ప్రశంసలు కురిపించడం గమనార్హం. రాహుల్ సొంత నియోజకవర్గమైన అమేథీలో ఆయన పని తీరును వరుణ్ గాంధీ మెచ్చుకున్నారు.

 BJP's Varun praises cousin rival Rahul's work in Amethi

సాధారణంగా తన పెద్దమ్మ సోనియా గాంధీ, తన పెదనాన్న కుమారుడు రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడని మేనకా గాంధీ (సంజయ్ గాంధీ భార్య) కుమారుడు వరుణ్ గాంధీ మొదటిసారి పెదవి విప్పాడు! అమేథీలో మహిళల సాధికారత కోసం రాహుల్ చేస్తున్న కృషి అద్భుతమని ప్రశంసలతో ముంచెత్తాడు.

దీనికి రాహుల్ నుంచి కూడా సానుకూల స్పందన లభించింది. తన సోదరుడు తన పని తీరును మెచ్చుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని రాహుల్ చెప్పాడు. కాగా, తన రాహుల్‌కు తన ప్రశంసల పైన వరుణ్ తర్వాత ట్విట్టర్లో స్పందించారు. అమేథీలో బాగా వర్క్ చేస్తున్నాడని తాను విన్నాను తప్పితే.. వెళ్లి స్వయంగా చూడలేదని, అలాగే తన వ్యాఖ్యలు రాజకీయాలకు అతీతమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+