బెంగాల్ లో బీజేపీ గెలుపు వెనుక - మోదీ, షా, సువేందు కాదు.. ఆ "మాస్టర్ మైండ్" ..!!

బెంగాల్ లో బీజేపీ ఎట్టకేలకు విజయం సాధించింది. సుదీర్ఘ కాల నిరీక్షణ ఫలించింది. మమతా కోటలను బీజేపీ కూల్చి కాషాయ జెండా ఎగుర వేసింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్నికల ఫలితాలు మార్గం సుగమం చేసాయి. అయితే.. బెంగాల్ లో ఈ విజయం వెనుక మోదీ- షా నమ్మిన ట్రబుల్ షూటర్ శ్రమ దాగి ఉంది. సువేందు తెర పైన.. ఈ వ్యూహకర్త తెర వెనుక పక్కా ప్రణాళికా బద్దంగా పార్టీని విజయం వైపు నడిపించారు. హర్యానా.. బీహార్ లో.. ఇప్పుడు బెంగాల్ లో ఈ ఒకే ఒక్కడు బీజేపీ విజయం వెనుక కీలక పాత్ర పోషించారు.

బెంగాల్ లో దీదీని ఓడించి బీజేపీ పాగా వేసింది. ఈ విజయం మోదీ -షా కు దక్కుతుందని అందరూ భావిస్తారు. వారిద్దరి ప్రచారం.. మార్గదర్శనం ఉన్నప్పటికీ.. రెండేళ్ల క్రితమే బెంగాల్ లో అడుగు పెట్టి.. ప్రతీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ.. పక్కా వ్యూహాత్మకంగా విజయ తీరా లకు చేర్చిన పార్టీ వ్యూహకర్త ది ఇక్కడ కీలక పాత్ర. హర్యానా.. బీహార్ లో తమ అంచనాలను నిజం చేస్తూ పార్టీని గెలిపించిన సునీల్ బన్సాల్ కు మోదీ - షా ద్వయం బెంగాల్ బాధ్యతలను ప్రత్యేకం గా అప్పగించింది. దీంతో.. రెండేళ్ల క్రితమే సునీల్ బన్సాల్ తన మకాం బెంగాల్ కు మార్చేసారు. ఇక, అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, సువేందు అధికారి లాంటి వారిని సమన్వయం చేసుకుంటూ పోలింగ్ బూత్ స్థాయి నుంచి నియోజకవర్గాల వరకు పార్టీని సమాయత్తం చేసారు. టీఎంసీ బలం.. బలహీనతలను నియోజకవర్గాల వారీగా గుర్తించి స్థానిక వ్యూహాలను అమలు చేసారు. ప్రతీ పది రోజులకు ఒక సారి మోదీ- షా ను కలిసి స్థానిక నివేదికలు అందించే వారు. వారి సూచనల మేరకు క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ ను ముందుకు నడిపించారు.

బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా, సువేందుకు ఛాన్స్ లేదా - మోదీ ఛాయిస్..!!
బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా, సువేందుకు ఛాన్స్ లేదా - మోదీ ఛాయిస్..!!
bjp-s-west-bengal-battle-plan-gains-momentum-with-sunil-bansal-s-strategic-leadership-here-the-deta

రెండేళ్లుగా ప్రణాళికా బద్దంగా.. వ్యూహాత్మకంగా

ప్రతీ 60 మంది ఓటర్లకు ఒక పార్టీ ప్రముఖ్ ను అనుసంధానం చేసారు. ప్రతీ పోలింగ్ బూత్ పరిధి లో 15 మంది ఖచ్చితంగా బీజేపీకి అనుబంధంగా మార్చుకున్నారు. ఈ స్థాయిలో నెట్‌వర్క్‌ను బన్సల్ నిశితంగా .. ప్రణాళికా బద్దంగా నిర్వహించారు. ఇక.. సునీల్ బన్సాల్ కు మరో ముఖ్య నేత భూపేంద్ర యాదవ్ పార్టీ సమన్వయ బాధ్యతలను పర్యవేక్షించారు. దాదాపుగా రాష్ట్రంలో 1.65 లక్షల చిన్న పాటి సమావేశాలు... 12 వేల కు పైగా గ్రామ స్థాయి మీటింగ్స్ నిర్వహించారు. 220 నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని అక్కడ.. ప్రత్యేకంగా పార్టీ సమన్వయ కర్తలను ఏర్పాటు చేసారు. వారితో నిరంతరం టచ్ లో ఉంటూ.. బీజేపీ అనుబంధ సంఘాల సహకారం తీసుకుంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో మోదీ- షా సభలు.. ప్రచారం చేసేలా ప్లాన్ చేసారు. అభ్యర్ధుల ఎంపిక.. మేనిఫెస్టో సైతం వారే ఖరారు చేసారు. ఇక, ఇప్పుడు బీజేపీ ఎంతో కాలంగా వేచి చూస్తున్న ఫలితం వచ్చేసింది. మమతా కోటలను కూల్చివేసి బీజేపీ కొత్త చరిత్ర లిఖించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+