వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి రజనీకాంత్ షాక్, సంతోషం లేదు: జయపై కరుణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: జైలు నుండి విడుదలైన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలపడం భారతీయ జనతా పార్టీని షాక్‌కు గురి చేసిందని అంటున్నారు. రజనీని తమ పార్టీలోకి తెచ్చేందుకు బీజేపీ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆయన హఠాత్తుగా జయకు లేఖ రాయడం బీజేపీకి రుచించలేదని అంటున్నారు. రజనీతో పాటు కేంద్రమంత్రి మేనకా కాంధీ కూడా జయకు శుభాకాంక్షలు తెలియ చేయడం పార్టీలో చర్చించుకుంటున్నారని చెబుతున్నారు.

జయలలిత

జయలలిత

జైలు నుండి విడుదలైన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలపడం భారతీయ జనతా పార్టీని షాక్‌కు గురి చేసిందని అంటున్నారు.

జయలలిత

జయలలిత

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నప్పుడు స్థానిక విలేకరులు బిజీబీజీగా ఉండేవారు.

జయలలిత

జయలలిత

వారికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త డెవలప్‌మెంట్స్ ఉండేవి. అయితే, జయ జైలు నుండి విడుదలై చెన్నైకి వెళ్లాక వారు బోర్‌గా ఫీలవుతున్నారట.

జయలలిత

జయలలిత

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నప్పుడు స్థానిక విలేకరులు బిజీబీజీగా ఉండేవారు.

జయలలిత

జయలలిత

వారికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త డెవలప్‌మెంట్స్ ఉండేవి. అయితే, జయ జైలు నుండి విడుదలై చెన్నైకి వెళ్లాక వారు బోర్‌గా ఫీలవుతున్నారట.

జయలలిత

జయలలిత

జయలలిత జైలు నుండి విడుదల కావడంపై డీఎంకే అధ్యక్షులు కరుణానిధి స్పందించారు. జయలలిత జైలుకు వెళ్లినప్పుడు తాను సంతోషించలేదని, అలాగే ఇప్పుడు విడుదలై బయటకు వస్తే బాధపడలేదని చెప్పారు.

రజనీకాంత్ శుభాకాంక్షల పైన భిన్నస్వరాలు

రజనీకాంత్ సినీ పరిశ్రమ కోసం పని చేస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ, బీజేపీ గెలిచినప్పుడు వారికి అభినందనలు తెలిపారని, ఇప్పుడు జయ జైలు నుండి విడుదలైనప్పుడు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారని చెబుతున్నారు. రజనీకాంత్ ఎప్పుడు కూడా రాజకీయల్లో కూరుకుపోరంటున్నారు. తన చిత్రాలకు రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రజనీకాంత్ ఇలా రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తారనే వాదన కూడా ఉంది.

రజనీకాంత్ లేఖ పైన బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసాయి సౌందరరాజన్ స్పందించారు. అతనిని తాము ఎప్పుడు బీజేపీలోకి ఆహ్వానిస్తామని, అతను లేఖ రాసినంత మాత్రాన అదో విషయం కాదని అభిప్రాయపడ్డారు. రజనీ లేఖ వల్ల ఎలాంటి నష్టం లేదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పారు. మరోవైపు, రజనీకాంత్ పైన సామాజిక వెబ్‌సైట్లలో అనుకూలంగా, వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కామెంట్స్ రాస్తున్నారు.

రజనీకాంత్ లేఖకు జయ స్పందన

తనకు శుభాకాంక్షలు చెబుతూ లేఖ రాసిన రజనీకాంత్, మేనకా గాంధీలకు జయలలిత ధన్యవాదాలు తెలిపారు. కేంద్రమంత్రిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన గురించి ఆలోచించడం తనను కదిలించిందని, మీ ఉత్తరం తన మనసు లోతులను తాకిందని జయ.. మేనకా గాంధీ లేఖ పైన స్పందించారు. మీ ఉత్తరం చూసి ఎంతో సంతోషించానని, మీరు వ్యక్తం చేసిన సానభూతికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని, మీ కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు అని జయ.. రజనీకి ప్రత్యుత్తరం రాశారు.

సంతోషం, బాధ లేదు: కరుణానిధి

జయలలిత జైలు నుండి విడుదల కావడంపై డీఎంకే అధ్యక్షులు కరుణానిధి స్పందించారు. జయలలిత జైలుకు వెళ్లినప్పుడు తాను సంతోషించలేదని, అలాగే ఇప్పుడు విడుదలై బయటకు వస్తే బాధపడలేదని చెప్పారు.

English summary
A very personal and touching greetings by actor Rajinikanth and Union Minister Maneka Gandhi to AIADMK general secretary Jayalalithaa on Sunday have given a jolt to Tamil Nadu BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X