Surprise: నక్కతోక తొక్కిన నటి నమిత, బుట్టబొమ్మకు ఊహించని చాన్స్, గౌతమి, గాయిత్రికి చాన్స్!

చెన్నై/ న్యూఢిల్లీ: ద్రవిడ దేశం తమిళనాడు రాష్ట్రంలో పాగా వెయ్యాలని బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులో లక్షకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన రోజే ఆ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ శాఖలో స్టార్ హీరోయిన్లతో మెరిసిపోయే విదంగా కమిటీని ఏర్పాటు చేశారు. ఇక బహుబాషా నటి, బుట్టబోమ్మ నమిత నక్కతోక తొక్కింది. అలనాటి స్థార్ హీరోయిన్ గౌతమితో పాటు ప్రముఖ నటి గాయిత్రీ రఘురామ్, అన్నాడీఎంకే నుంచి జంప్ అయిన మాజీ ఎంపీ శశికళ పుష్పాకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ కమిటీలో కీలకపదవులు దక్కాయి.

కొలువు దీరిన మురుగన్ టీం

కొలువు దీరిన మురుగన్ టీం

తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు ఎల్. మురుగన్ టీం కొలువు దీరింది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. మురుగన్ టీంలో పది మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, మహిళా అధ్యక్షురాలు, సాంస్కృతిక శాఖ అధ్యక్షురాలు, బీజేపీ యువజన విభాగం అధ్యుకుడు, మహిళా విభాగం అధ్యక్షరాలితో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నియమించారు.

జుంబో జట్టు అదిరింది

జుంబో జట్టు అదిరింది

ఇటీవల డీఎంకే పార్టీ నుంచి బీజేపీలో చేరిన సీనియర్ రాజకీయ నాయకుడు వీపీ. దురైస్వామి, అన్నాడీఎంకే పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఫైర్ బ్రాండ్, మాజీ రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పాలకు ప్రధాన కార్యదర్శుల పదవులు దక్కాయి. ఇక ప్రముఖ సినీనటి గాయిత్రి రఘురామ్ కు ఏకంగా బీజేపీ తమిళనాడు శాఖ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలి పదవి ఇచ్చి అందలం ఎక్కించారు.

నక్కతోక తొక్కిన నమిత

నక్కతోక తొక్కిన నమిత

కొన్ని సంవత్సరాల పాటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన బుట్టబొమ్మ, ముద్దుగుమ్మ నమిత నక్కతోక తొక్కింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరిన వెంటనే నమితకు రాష్ట్ర కార్యవర్గం సభ్యురాలిగా బాధ్యతలు అప్పగించారు. బాలకృష్ణ, నమిత నటించిన సింహా చిత్రంలో ‘సింహమంటి చిన్నోడే 'పాటతో మెరిసిపోయిన నమితకు మళ్లీ సుడితిరింది.

ఊహించలేదు, ఫుల్ హ్యాపీ

ఊహించలేదు, ఫుల్ హ్యాపీ

బీజేపీ తమిళనాడు శాఖ రాష్ట్ర కమిటీలో కార్యవర్గ సభ్యురాలిగా తనను నియమిస్తారని తాను అస్సలు ఊహించలేదని నమిత అంటున్నారు. తెలుగు, తమిళ సినీరంగంలో ఓ వెలుగు వెలిగిన నమిత తరువాత అవకాశాలు తగ్గిపోవడంతో కొంతకాలం సైలెలంగ్ ఉండిపోయింది. తరువాత బాలకృష్ణ నటించిన సింహా చిత్రంలో ఓ చాన్స్ రావడంతో సింహమంటే చిన్నోడే అంటూ తన అందచాందాలతో ఓ ఊపు ఉపేసిన నమిత తరువాత తిరుపతిలో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యింది.

గౌతమి, గాయిత్రి రఘురామ్

గౌతమి, గాయిత్రి రఘురామ్

బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ కమిటీలో సినీతారలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అలనాటి బహుబాష నటి, కొంత కాలంగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్న గౌతమికి బీజేపీ నాయకులు అవకాశం ఇచ్చారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ కార్యవర్గ సభ్యురాలిగా గౌతమికి అవకాశం ఇచ్చారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖలో సినీ ప్రముఖులకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ప్రముఖ నటి గాయిత్రి రఘురామ్ కు ఏకంగా బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలి పదవి ఇచ్చారు. బీజేపీ తమిళనాడు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా మీనాక్షిని నియమించారు.

Recommended Video

    Priyanka Gandhi Set To Shift to Lucknow || Oneindia Telugu
    తెలంగాణ గవర్నర్ పదవితో ఖాళీ

    తెలంగాణ గవర్నర్ పదవితో ఖాళీ


    తమిళనాడు రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలి పదవిలో ఉన్న తమిళసై సౌందరరాజన్ ను బీజేపీ అధిష్టానం తెలంగాణ గవర్నర్ గా నయమించింది. తమిళసై సౌందరాజన్ తెలంగాణ గవర్నర్ పదవి చేపట్టిన తరువాత తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీ అయ్యింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా ప్రముఖ బీజేపీ నాయకుడు ఎల్. మురుగన్ ను ఇంతకు ముందే నియమించారు. మురుగన్ తన మార్క్ స్పష్టంగా కనపడే విధంగా, గతంలో తమిళసై సౌందర్యరాజన్ ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో ఇప్పుడు జంబో జట్టును ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం మీద తమిళనాడులో పూర్తి స్థాయి బీజేపీ కమిటీ ఏర్పాటు కావడంతో ఆ పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+