అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Maharashtra, Haryana exit polls: మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీదే అధికారమన్న ఎన్డీటీవీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సోమవారం ముగిసిన వెంటనే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మహారాష్ట్ర, హర్యానాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీనే తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చాయి.

Maharashtra, Haryana exit polls: మహారాష్ట్రలో బీజేపీ-శిసేన దాదాపు క్లీన్‌స్వీప్! హర్యానాలోనూ అంతేMaharashtra, Haryana exit polls: మహారాష్ట్రలో బీజేపీ-శిసేన దాదాపు క్లీన్‌స్వీప్! హర్యానాలోనూ అంతే

ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ కూడా మహారాష్ట్ర, హర్యానాలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని తేల్చింది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలుండగా 211 స్థానాల్లో బీజేపీ-శివసేన కూటమి విజయం సాధిస్తుందని, ఇక 64 సీట్లలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి గెలుస్తుందని పేర్కొంది. ఇతరులకు 13 స్థానాలు దక్కే అవకాశం ఉంది.

BJP To Retain Power In Maharashtra, Haryana, Shows NDTVs Poll Of Polls

హర్యానాలో మొత్తం 90 స్థానాలుండగా.. బీజేపీ 66 స్థానాల్లో విజయం సాధిస్తుందని, కేవలం కాంగ్రెస్ 14 స్థానాల్లోనే గెలుపొందుతుందని అంచనా వేసింది. ఇతరులు 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.

మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు

బీజేపీ-శివసేన కూటమి - 211
కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి - 64
ఇతరులు - 13

హర్యానా అసెంబ్లీ స్థానాలు మొత్తం: 90
బీజేపీ: 66
కాంగ్రెస్: 14
ఇతరులు: 2

మహారాష్ట్రలో 288 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మేజిక్ ఫిగర్ 145. ఇక్కడ బిజేపీ, మిత్రపక్షాలు కలిసి 164 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మరో మిత్రపక్షం శివసేన 124 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ 147, ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీ చేస్తోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన 101 స్థానాల్లో బరిలోకి దిగింది. ప్రముఖుల్లో ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ నైరుతీ నుంచి, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ బోకార్ నుంచి, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ కారాడ్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే, ఉద్దవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరే శివసేన నుంచి వర్లి నుంచి పోటీలో ఉన్నారు.

హర్యానాలో 90 స్థానాలకు గాను మేజిక్ ఫిగర్ 46. బీజేపీ, కాంగ్రెస్‌లు 90 స్థానాల్లో పోటీ పడుతుండగా, బీఎస్పీ 87 స్థానాల్లో, ఐఎన్ఎల్డీ 81 స్థానాల్లో పోటీ చేస్తోంది. బరిలో ఉన్న ప్రముఖుల్లో బీజేపీ నేత, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ నియోజకవర్గం నుంచి, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా గర్హి శాంప్లా-కిలోయి నుంచి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఖైతాల్ నుంచి, జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా ఉచన కలాన్ నుంచి, ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింక్ చౌతాలా ఎల్లెనాబాద్ నుంచి బరిలో ఉన్నారు.

English summary
The ruling BJP is set to retain power in Maharashtra and Haryana in the first elections to be held since Prime Minister Narendra Modi's landslide win in the national election in May, exit polls said after voting ended in the two states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X