రాహుల్ వ్యాఖ్యల్ని సెన్సార్ చేయండి-ఈసీని ఆశ్రయించిన బీజేపీ..!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు బీజేపీని ఎక్కడో తాకుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాలు అవకాశాలు లాగేసుకుంటున్నాయని రాహుల్ చేసిన విమర్శలపై బీజేపీ మండిపడుతోంది. ఇదే అంశంపై ఇవాళ ఈసీని ఆశ్రయించింది. రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఫిర్యాదులో పేర్కొంది.
గత వారం ముంబైలో చేసిన ప్రసంగంలో రాహుల్ గాందీ ఓ విభాగాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీకి లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో బీజేపీ.. మహారాష్ట్ర నుంచి విడిపోయిన రాష్ట్రాలు ఇప్పుడు వారి అవకాశాలు కూడా లాక్కుంటున్నాయని తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించింది. మహారాష్ట్రలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడారని.. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని తెలిపింది.

యాపిల్ ఐఫోన్లు, బోయింగ్ విమానాలు మహారాష్ట్ర డబ్బుతో ఇతర రాష్ట్రాల్లో తయారవుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపణలు చేసినట్లు బీజేపీ తెలిపింది. గతంలలో నోటీసులు అందిన తర్వాత కూడా రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. వాస్తవానికి 2024-25 ఏప్రిల్ నుండి జూన్ వరకు మొత్తం రూ.70,795 కోట్ల పెట్టుబడులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉందని తెలిపింది. రాహుల్ గాంధీ ప్రకటనలు మహారాష్ట్ర యువతను రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంది. దీనిపై చర్యలు తీసుకున్నాయని వెల్లడించింది.












Click it and Unblock the Notifications