క్షీణించిన అద్వానీ ఆరోగ్యం..హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
బీజేపీ అగ్రనేత, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 9గంటలకు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యం క్షీణించండంతో అద్వానీని ఎమర్జెన్సీకి తరలించారు. గత నెల 26న కడా అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉండటంతో డాక్టర్లు చిన్న పాటి సర్జరీ చేసి డిశ్చార్జ్ చేశారు.
ఈ క్రమంలోనే మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం అద్వానీ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అపోలో ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఆయన క్షేమంగా తిరిగి రావాలని బీజేపీ శ్రేణులు పూజలు చేస్తున్నారు. అద్వానీ కష్ట ఫలితంగానే ఈరోజున బీజేపీ దేశాన్ని పరిపాలించగల్గుతుందని..అలాంటి నేత పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

మరోవైపు ప్రధాని మోదీ సైతం అద్వానీ ఆరోగ్య పరిస్ధితి గురించి ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలను అడిగి తెలుసుకుంటున్నారు. అద్వానీకి మైరుగైన వైద్యం అందించాలని మోదీ వైద్యులకు సూచించారు. దేశ ప్రధానిగా మూడోసారి పగ్గాలు చేపట్టే ముందు మోదీ అద్వానీ దగ్గరకు వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications