ఎల్‌కే అద్వానీ ఇంట విషాదం: భార్య కన్నుమూత
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి కమలా అద్వానీ బుధవారం కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.

దీంతో అద్వానీ ఇంట విషాదం నెలకొంది. కాగా, బీజేపీ కురువృద్ధుడిగా, పార్టీని ఒంటిచేత్తో మోసిన వ్యక్తిగా అద్వానీని అంతా గౌరవిస్తారు. పార్టీకి ఎనలేని సేవలు చేసిన అద్వానీ జీవితంలో చోటు చేసుకున్న ఈ విషాదంతో పార్టీలో కూడా విషాదం అలముకుంది. అంతేకాదు ఈరోజు బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం కావడం విశేషం.
గతంలో డిసెంబర్, 2015లో ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో అప్పట్లో ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్సను అందించారు. కమలా అద్వానీ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బీజేపీ కార్యకర్తలకు కమలా స్ఫూర్తిగా నిలిచారని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. కమలా అద్వానీ మృతిపట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, గుజరాత్ సీఎం ఆనందీ బెన్, పశ్చిమబంగా సీఎం మమతా బెనర్జీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు సంతాపం ప్రకటించారు.
Deeply pained & saddened by Kamla Advani ji's demise. She always inspired & motivated Karyakartas & was LK Advani ji's pillar of strength.
— Narendra Modi (@narendramodi) 6 April 2016
I recall my many interactions with Kamla Advani ji. My thoughts are with the Advani family in this hour of grief. May her soul rest in peace
— Narendra Modi (@narendramodi) 6 April 2016
Very sorry to hear about the tragic passing of Mrs Kamla Advani. My heartfelt condolences to Jenab Advani sahib, Pratibha & Jayant.
— Omar Abdullah (@abdullah_omar) 6 April 2016
Extremely saddened to hear abt Smt Kamla Advani Jis demise.My prayers are w/ AdvaniJis family,may god giv thm strength in ths hour of grief.
— Anurag Thakur (@ianuragthakur) 6 April 2016
Congress President Smt. Sonia Gandhi has expressed deep grief & sorrow at the passing away of Smt. Kamla Advani.
— INC India (@INCIndia) 6 April 2016
Saddened at the passing of Kamla Advani ji. Great loss to Advani ji and family. My deepest condolences
— Mamata Banerjee (@MamataOfficial) 6 April 2016
Grieved to learn about the sad demise of Smt Kamla Advani ji. My heartfelt condolences to L K Advani ji & his family in this difficult time.
— Anandiben Patel (@anandibenpatel) 6 April 2016












Click it and Unblock the Notifications