నాపై ద్వేషం లేదు, సెంచరీ కొడతాం: సాయికుమార్, నాన్న గెలిస్తే మంచి చేస్తారన్న ఆది
Recommended Video

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకే పట్టం కడతారని ఆ పార్టీ నేత, ప్రముఖ నటుడు సాయి కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తరపున భాగేపల్లి-2 నియోజకవర్గం నుంచి సాయికుమార్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
2008లో 2వేల ఓట్లతో ఓడిపోయిన ఆయన ఇప్పుడు తనదే గెలుపు అని అంటున్నారు. తన తల్లి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తనకు చెప్పారని, అందుకే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

నాపై ద్వేషం లేదు
తాను దూరంగా ఉంటున్నాననే భావన తప్ప, ఇక్కడి ప్రజలకు తనపై ఎలాంటి ధ్వేషం లేదని సాయికుమార్ అన్నారు. తాను సున్నాతో మొదలు పెట్టి 25వేల ఓట్లు సాధించే స్థాయికి ఎదిగానని చెప్పారు. ప్రజలంతా తమతోనే ఉన్నారని కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు. అన్ని పార్టీలలో అవినీతి పరులున్నారని, అదే తన బాధ అని అన్నారు. శ్రీరాములు డిప్యూటీ సీఎం కావాలని ఇక్కడి ప్రజల కోరుకుంటున్నారని అన్నారు.

సిద్ధరామయ్యే ఓడిపోతారు
ప్రస్తుతం సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఈ ఎన్నికల్లో ఓడిపోతారని అన్నారు. సిద్ధరామయ్యది స్కాంల ప్రభుత్వమని సాయికుమార్ ఆరోపించారు. చిన్న పని కావాలన్న లంచం, అవినీతి తప్పదని అన్నారు. వేల కోట్ల ఖర్చు పెట్టానంటున్న సిద్ధరామయ్య.. ఏం అభివృద్ధి చేశారో తెలియడం లేదని అన్నారు. రోడ్లు లేవు, స్కూళ్లు లేవు, వైద్య సదుపాయం లేదని అన్నారు.

మోడీ, షా నేతృత్వంలో మంచి ప్రభుత్వం
తమ ప్రభుత్వం ఏర్పాటైన 24గంటల్లోనే రైతుల రుణమాఫీ చేస్తామని సాయికుమార్ తెలిపారు. కన్నడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందించారని తెలిపారు. మోడీ, షాల నేతృత్వంలో వచ్చే ప్రభుత్వం కన్నడ ప్రజలకు మంచి, నిజాయితీ గల ప్రభుత్వాన్ని అందిస్తుందని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో ఒక్క స్కాం కూడా జరగలేదని సాయికుమార్ చెప్పారు.

అందరివాడిని.. యువతంతా..
తాను సినిమా రంగానికి చెందిన వాడినని, తమకు కులం, మతం ఉండవని సాయికుమార్ అన్నారు. ఇప్పుడు తమ ప్రచారం ఊపందుకుందని చెప్పారు. భాగేపల్లి యువతంతా బీజేపీ వైపే ఉన్నారని తెలిపారు. ఇక్కడి ప్రజలకు తనంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఇప్పుడు ఓటర్లుగా ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. అయితే, ఈ ఎన్నికలు తనకు సవాలేనని అన్నారు. బీజేపీ తనను అభ్యర్థిగా ప్రకటించిడంతో.. ఇక్కడి బీజేపీ నాయకత్వం, శ్రేణులు తనకు మద్దతుగా ఉన్నారని చెప్పారు. భాగేపల్లిలో గెలిచి చూపిస్తానని అన్నారు. ‘హీరోలు విలన్లు లేరీ నాటకంలో' అంటూ ఓ సినిమాలోని డైలాగ్‌ను ఈ సందర్భంగా సాయికుమార్ చెప్పారు.

సెంచరీ కొడతాం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశం లేదని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సాయికుమార్ చెప్పారు. గత ఎన్నికల్లో యూనిటీ దెబ్బ తినడం వల్లే బీజేపీ ఓడిపోయిందని.. ఇప్పుడు మళ్లీ అంతా కలిసి ఐక్యంగా బరిలో దిగుతున్నారని చెప్పారు. మోడీ ప్రచారంతో బీజేపీకి మరింత ఊపు వచ్చిందని, వందకుపైగా సీట్లు ఖాయమని సాయికుమార్ ధీమా వ్యక్తం చేశారు.

నాన్న గెలిస్తే మంచి చేస్తారు: ఆది
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తమ నానమ్మ చెప్పేదని, అందుకే తన తండ్రి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని సాయికుమార్ తనయుడు ఆది అన్నారు. గతంలో ఓడిపోయినప్పుడు తాము బాధపడలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఇక్కడి ప్రజలకు సాయికుమార్ మంచి పనులు చేస్తారని అన్నారు. తప్పకుండా తండ్రి గెలుస్తారని అన్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications