బీజేపీలో ఏమి జరుగుతోంది..? సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సొంత పార్టీ కార్యకర్త... అరెస్ట్!

గౌహతి : సోషల్ మీడియాలో సీఎంపై అనుచిత పోస్టులు చేసి ఓ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. ముఖ్యమంత్రిని అవమానించేలా పోస్టులు చేశాడంటూ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. సీఎం గురించి తప్పుగా మాట్లాడారంటూ మరో ముగ్గురిని కూడా పోలీసుల అదుపులోకి అసోంలో సంచలనం రేపింది. సొంత పార్టీ కార్యకర్తల్నే అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

అసోం మెగిగామ్ జిల్లాకు చెందిన నీతుబోరా బీజేపీ ఐటీ సెల్ మెంబర్ పనిచేస్తున్నాడు. గతవారం ఆయన సీఎం సర్బానంద సోనోవాల్‌ పనితీరుపై సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశాడు. అసోంలో బీజేపీ సర్కారు ముస్లిం వలసదారుల నుంచి అసోం ప్రజలను రక్షించడంలో విఫలమైందని, దీనికి సీఎం సర్బానంద సోనోవాల్ కారణమని ఆయన సోషల్ మీడియాలో ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు అందడంతో ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు నీతుబోరాను అరెస్ట్ చేశారు.

BJP Worker Arrested For Post On Assam Chief Minister

సీఎం పనితీరును తప్పుబట్టారంటూ మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం అర్థరాత్రి బీజేపీ ఐటీ సెల్ మెంబర్‌గా పనిచేస్తున్న హేమంత బరువా అనే వ్యక్తి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. సొంత పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే బీజేపీ పెద్దలు వాక్ స్వాతంత్ర్య హక్కును ఎందుకు కాలరాస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారు తమ అసంతృప్తిని వెలిబుచ్చారే తప్ప ఎవరినీ కించపరచలేదని అంటున్నారు. అరెస్ట్ చేసిన కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+