బెంగాల్‌లో టెన్షన్ టెన్షన్: బీజేపీ-టీఎంసీ కార్యకర్తల ఘర్షణ, ఒకరి మృతి..
బెంగాల్‌లో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య గొడవ చల్లారడం లేదు. బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్‌పై దాడి అంశంపై వివాదం చెలరేగుతూనే ఉంది. అయితే శనివారం బీజేపీ-టీఎంసీ కార్యకర్తలు బాహా బాహీకి దిగారు. ఘర్షణలో 6 నుంచి ఏడుగురు గాయపడగా ఒకరు మృతిచెందారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉత్తర 24 పరగణ జిల్లా హలిషాహర్ వద్ద బీజేపీ శ్రేణులు గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన వారి గొడవ పడ్డారు. ఏడుగురు వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కల్యాణిలో గల జేఎన్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులను మొహరించారు. ఘటనపై టీఎంసీ స్పందించింది. వ్యక్తిగత శత్రుత్వంలోనే దాడి జరిగిందని ఆరోపించింది. మరో రోజు.. మరో హత్య జరిగింది అని బీజేపీ నేత ఒకరు ట్వీట్ చేశారు.

Recommended Video
బెంగాల్‌లో బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడిపై రగడ కొనసాగుతూనే ఉంది. ఘటనపై నివేదిక ఇవ్వాలని హోం శాఖ కోరగా.. అందుకు బెంగాల్ ప్రభుత్వం తోసిపుచ్చింది. దీనిపై కేంద్ర హోం శాఖ మరో స్టెప్ ముందుకు తీసుకుంది. నడ్డా పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న ముగ్గురు ఐపీఎస్‌లను డిప్యూటేషన్‌పై పంపాలని కోరింది.
నడ్డా పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న డైమండ్ హర్బర్ ఎస్పీ భోలానాథ్ పాండే, దక్షిణ బెంగాల్ ఏడీజీ రాజీవ్ మిశ్రా, ప్రెసిడెన్సీ రేంజ్ డీఐజీ ప్రవీణ్ త్రిపాఠీలను కేంద్ర సర్వీసులకు పంపాలని హోంశాఖ కోరింది. నడ్డా పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న ఈ ముగ్గురే దాడికి బాధ్యత వహించాలని కేంద్రం అంటోంది. ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారుల డిప్యూటేషన్‌కి సంబంధించి బెంగాల్ ప్రభుత్వానికి సమాచారం అందజేశామని తెలిపింది. ఈ గొడవ జరుగుతుండగానే.. మరో వివాదం చెలరేగింది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications