Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Black beauty: ఓసేయ్ కర్రిదానా ?, భార్య చర్మం గురించి చీఫ్ గా మాట్లాడిన భర్త, మర్మాంగం కోసేసిన భార్య!

చత్తీస్ గఢ్: ఏమి తిట్టినా పడి ఉంటారులే అనుకుంటున్న కొందరు భర్తలు వారి భార్యలను నోటికి వచ్చినట్లు అందరి ముందు తిడుతుంటారు. ఇలాగే నోరు పారేసుకున్న భర్తకు అతని భార్య ఊహించని షాక్ ఇచ్చింది. పెళ్లికి ముందే వివాహం చేసుకోవడం ఇష్టమే అని యువతి, యువకుడు వాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పారు. పెళ్లికూడా సంతోషంగా చేసుకున్నారు. భర్త కంటే భార్య నల్లగా ఉంటుంది. వివాహం జరిగిన తరువాత భర్త అతని భార్యను నువ్వు బ్లాక్ బ్యూటీ, నల్లరాయిలా, బండరాయిలా ఉంటావు అంటూ అప్పుడప్పుడు ఆటపట్టించేవాడు.

భర్త తనను కావాలని ఆటపట్టిస్తున్నాడని మొదట్లో భార్య పెద్దగా పట్టించుకోలేదు. అయితే రానురాను భర్త అందరి ముందు భార్యను నువ్వు చాలా నల్లగా ఉన్నావు, నిన్ను ముట్టుకోవాంటే అసహ్యంగా ఉంటుంది అంటూ మాట్లాడటం మొదలు పెట్టాడు. చాలాకాలం నుంచి ఓపికగా ఉన్న భార్య భర్త మీద రగిలిపోయింది.

రాత్రి భర్త ఓసేయ్ కర్రిదానా అంటూ అతని నోటిదురుసుతో భార్యను తిట్టాడు. కోపం తట్టుకోలేని భార్య కొడవలి తీసుకుని నిద్రపోతున్న భర్త మర్మాంగం కోసేయడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్య చర్మం గురించి చీఫ్ గా మాట్లాడిన భర్త మర్మాంగం కోసేసి హత్య చెయ్యడం కలకలం రేపింది.

పెళ్లి చేసుకుంటాడా ? లేదా

పెళ్లి చేసుకుంటాడా ? లేదా

చత్తీస్ గఢ్ లోని దుర్గా జిల్లాలో అనంత్ సోన్వాని అలియాస్ అనంత్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సంగీతా అనే యువతితో అనంత్ పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. సంగీతా నల్లగా ఉండటంతో అనంత్ పెళ్లి చేసుకుంటాడో చేసుకోడో ? అసలు పెళ్లికి అంగీకరిస్తాడో లేదో ? అని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు.

ఓసేయ్ కర్రిదానా.......నువ్వు బ్లాక్ బ్యూటీ

ఓసేయ్ కర్రిదానా.......నువ్వు బ్లాక్ బ్యూటీ

పెళ్లికి ముందే వివాహం చేసుకోవడం ఇష్టమే అని అనంత్, సంగీతా వాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పారు. పెళ్లికూడా ఇద్దరూ చాలా సంతోషంగా చేసుకున్నారు. భర్త అనంత్ కంటే అతని భార్య సంగీతా నల్లగా ఉంటుంది. వివాహం జరిగిన తరువాత అనంత్ అతని భార్య సంగీతాను నువ్వు బ్లాక్ బ్యూటీ, నల్లరాయిలా, బండరాయిలా ఉంటావు అంటూ అప్పుడప్పుడు ఆటపట్టించేవాడు.

కళ్లు మూసుకుని నీతో కాపురం చేస్తున్నా

కళ్లు మూసుకుని నీతో కాపురం చేస్తున్నా

తన భర్త అనంత్ తనను కావాలని ఆటపట్టిస్తున్నాడని మొదట్లో సంగీతా పెద్దగా పట్టించుకోలేదు. అయితే రానురాను అనంత్ అందరి ముందు అతని భార్య సంగీతాను నువ్వు చాలా నల్లగా ఉన్నావు, నిన్ను ముట్టుకోవాంటే అసహ్యంగా ఉంటుంది, నీతో కళ్లు మూసుకుని కాపురం చేస్తున్నాను అంటూ ఆమెను చాలా చులకనగా మాట్లాడటం మొదలు పెట్టాడు.

రాజీ చేసినా భర్త పద్దతి మార్చుకోలేదు

రాజీ చేసినా భర్త పద్దతి మార్చుకోలేదు

చాలాకాలం నుంచి ఓపికగా ఉంటున్న సంగీతా ఆమె భర్త అనంత్ మీద రగిలిపోయింది. రెండుమూడుసార్లు అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన సంగీతాను రాజీచేసిన పెద్దలు మళ్లీ ఆమె భర్త అనంత్ ఇంటికి పంపించారు. అయితే అనంత్ మాత్రం అతని భార్య సంగీతా కలర్ విషయంలో ఆమెను చులకనగానే మాట్లాడుతున్నాడు.

భర్త మర్మాంగం కోసేసి నిద్రలోనే చంపేసి భార్య

భర్త మర్మాంగం కోసేసి నిద్రలోనే చంపేసి భార్య

రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన అనంత్ ఓసేయ్ కర్రిదానా అంటూ అతని నోటిదురుసుతో అతని భార్య సంగీతాను నోటికి వచ్చినట్లు తిట్టి భోజనం చేసి నిద్రపోయాడు. కోపం తట్టుకోలేని సంగీతా కొడవలి తీసుకుని నిద్రపోతున్న ఆమె భర్త అనంత్ మర్మాంగం కోసేయడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్య చర్మం గురించి చీఫ్ గా మాట్లాడుతున్న అనంత్ మర్మాంగాన్ని కోసేసిన సంగీతా అతన్ని హత్య చెయ్యడం చత్తీస్ గఢ్ లో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+