చేతబడులు వారి రాతను మార్చలేవు: కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ విసుర్లు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆగస్టు 5న నలుపు రంగు దుస్తుల్లో కాంగ్రెస్ నిరసన తెలపడాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. నిరాశ, నిస్పృహల్లో మునిగితేలుతూ కొందరు చేతబడిని ఆశ్రయిస్తున్నారంటూ పరోక్షంగా విమర్శించారు. చేతబడిని నమ్మేవారు ఎన్నటికీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేరని అన్నారు.

'షార్ట్‌కట్'లను అనుసరించే బదులు తమ ప్రభుత్వం సమస్యలకు శాశ్వత పరిష్కారాలను చూపుతుందని ప్రధాని అన్నారు. హర్యానాలోని పానిపట్‌లో 900 కోట్ల రూపాయలతో నిర్మించిన 2G ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రతిపక్షాలపై దాడికి దిగారు.

"ఆగస్టు 5న, కొంతమంది 'బ్లాక్ మ్యాజిక్'ని వ్యాప్తి చేయడానికి ఎలా ప్రయత్నించారో మనం చూశాము. ఈ వ్యక్తులు నల్ల బట్టలు ధరించడం ద్వారా తమ నిరుత్సాహాన్ని అంతం చేయవచ్చని అనుకుంటారు. కానీ చేతబడి, మూఢనమ్మకాలలో నిమగ్నమై వారు చేయలేరని వారికి తెలియదు. మళ్లీ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోండి' అని మోడీ హితవు పలికారు.

 Black Magic Cannot End Your Bad Days: PM Modi slams Congress

"నల్లని వస్త్రాలు ధరించడం వల్ల తమ నిరాశావాదం, ప్రతికూలతలను దూరం చేయవచ్చని కొందరు అనుకుంటారు, అయితే వారు అలాంటి వ్యూహాలను ఆశ్రయించగలరని వారికి తెలియదు కాని ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందలేరు" అని ఆయన అన్నారు. ఉచిత పథకాలు దేశ భవిష్యత్తుకు మంచివి కావదన్నారు.

"ఉచిత పథకాలు మన పిల్లల హక్కును కోల్పోయేలా చేస్తాయి. దేశం స్వయం సమృద్ధిగా మారకుండా నిరోధిస్తాయి. ఇటువంటి స్వార్థపూరిత విధానాలు దేశంలోని నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులపై మరింత భారాన్ని మోపుతాయి" అని మోడీ అన్నారు. అయితే, రాజకీయాల్లో స్వార్థం ఉంటే పెట్రోల్‌, డీజిల్‌ ఉచితంగా ఇస్తామని ఎవరైనా వాగ్దానం చేయవచ్చని అన్నారు. పెట్రోల్, డీజిల్ ఉచితంగా ఇస్తామని ఎవరూ ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు ప్రధాని మోడీ.

Recommended Video

    ప్రధాని మోడీకి పెరుగుతున్న ఆదరణను సొమ్ము చేసుకుంటూ *Politics | Telugu OneIndia

    ఉచిత వాగ్దానం చేసే వారు ఎప్పటికీ కొత్త టెక్నాలజీలలో పెట్టుబడి కోసం వనరులను కనుగొనలేరు అని అన్నారు. "ఇది సరైన విధానం కాదు, తప్పుదోవ పట్టించేది; ఇది జాతీయ ప్రయోజనాలకు సంబంధించినది కాదు, కానీ ఇది దేశానికి వ్యతిరేకం; ఇది దేశ నిర్మాణం కాదు, దేశాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం" అని వ్యాఖ్యానించారు. కాగా, ప్రధాని వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాము వేసుకున్న నల్ల దుస్తులు గురించి కాకుండా.. మీరు తెస్తానన్న నల్లధనం గురించి మాట్లాడాలంటూ చురకలంటిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+