Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Blackmail: 15 ఏళ్లుగా నగ్న వీడియోలతో గేమ్స్, రేప్ చేస్తున్న శర్మాకు షార్వా, 27 కత్తిపోట్లు !

భోపాల్/ బెంగళూరు: యువతిపై రేప్ చేసే సమయంలో వీడియోలు తీసిన కామాంధుడు వాటిని అడ్డుపెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పదేపదే అత్యాచారం చేస్తూ ఆమెతో గేమ్స్ ఆడుతున్నాడు. కామాంధుడి నుంచి తప్పించుకోవడానికి ఆమె పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యి భర్తతో కలిసి కాపురం చేసుకుంటున్నది. అయినా ఆమెపై కోరిక తీరని కామాంధుడు భర్త లేని సమయంలో ఇంట్లో దూరి అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. కూరగాయలు కత్తిరించే కత్తి తీసుకున్న మహిళ కామాంధుడు శర్మాపై 27 సార్లు పదేపదే పొడిచేయడంతో అతని షార్వా కారిపోయి పైలోకాలకు వెళ్లిపోయాడు. ఆత్మరక్షణ కోసం కామాంధుడిని చంపిన మహిళపై ఇప్పుడు మర్డర్ కేసు నమోదైయ్యింది.

16 ఏళ్ల వయసులో లైంగిక దాడి

16 ఏళ్ల వయసులో లైంగిక దాడి

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు 214 కిలోమీటర్ల దూరంలోని గుణ ప్రాంతంలో ప్రస్తుతం 31 ఏళ్ల సవిత (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. సవితకు 16 ఏళ్ల వయసు ఉన్న సమయంలో 2005వ సంవత్సరంలో గుణలోని అశోక్ నగర్ లో నివాసం ఉండే బ్రిజ్ భూషణ్ శర్మా అనే కామాంధుడు ఆమెపై కన్ను వేశాడు. ఆదే ఏడాది ఓ సందర్బంలో సవిత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్ శర్మా ఆమెపై లైంగిక దాడి చేశాడు.

రహస్యంగా రేప్ వీడియోలు

రహస్యంగా రేప్ వీడియోలు

సవిత మీద లైంగిక దాడి చేసే సమయంలో శర్మా రహస్యంగా వీడియోలు, ఫోటోలు చిత్రీకరించాడు. తరువాత అత్యాచారం చేసిన వీడియోలు, ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు అడ్డం పెట్టుకున్న శర్మా బ్లాక్ మెయిల్ చేస్తూ పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. తన లైంగిక కోరిక తీర్చకుంటే నీ నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని సవితను కామాంధుడు శర్మా బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు.

ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి

ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి

తల్లిదండ్రులు చూసిన వ్యక్తితో సవిత వివాహం చేసుకుంది. సవితకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త, పిల్లలతో కలిసి సవిత కాపురం ఉంటోంది. అయితే సవిత మీద కోరిక తీరని కామాంధుడు శర్మా వీలు చిక్కినప్పుడు ఆమె ఇంటికి వెళ్లి ఆమె నగ్న వీడియోలు చూపించి పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఎక్కడ ఈ విషయం బయటకు చెబితే తన కాపురం కూలిపోతుందో అనే భయంతో సవిత ఇంత కాలం ఓపిక పట్టింది.

 భర్త బయటకు వెళ్లిన వెంటనే శర్మా ఎంట్రీ

భర్త బయటకు వెళ్లిన వెంటనే శర్మా ఎంట్రీ

గత సోమవారం సవిత భర్త పనిమీద పొరుగు జిల్లాకు వెళ్లాడు. సవిత పిల్లలు ఇంటి బయట స్నేహితులతో కలిసి ఆడుకుని అలసిపోయి ఇంట్లోని బెడ్ రూమ్ లోకి వెళ్లి నిద్రపోయారు. ఆ సమయంలో పీకలదాక మద్యం సేవించిన శర్మా ఆమె ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడే తన కోరిక తీర్చాలని వీడియోలు చూపించి బెదిరించిన శర్మా సవితపై అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు.

27 కత్తిపోట్లతో శర్మా ఫినిష్

27 కత్తిపోట్లతో శర్మా ఫినిష్

కామాంధుడు శర్మా బారినుంచి తప్పించుకోవడానికి సవిత అనేక ప్రయత్నాలు చేసి చివరికి అతని కాళ్లు పట్టుకుంది. అయితే మద్యం మత్తులో ఉన్న శర్మా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. సహనం కోల్పోయిన సవిత ఇంట్లో కూరగాయాలు కత్తిరించే కత్తి తీసుకుని శర్మాపై 27 సార్లు కసితీరా పొడిచేసింది. శర్మాను కత్తితో పొడిచిన సవిత నేరుగా వెళ్లి స్థానిక గుణ పోలీస్ స్టేషల్ లో లొంగిపోయింది. తీవ్రగాయాలైన శర్మాను ఆసుపత్రికి తరలించగా చికిత్స విలఫై అతను మరణించాడు.

Recommended Video

    KL Rahul Wife:Google Search Shows Athiya Shetty As KL Rahul Wife| TROLLS on Google | Oneindia Telugu
    ఆత్మరక్షణ కోసం చంపితే మర్దర్ కేసు

    ఆత్మరక్షణ కోసం చంపితే మర్దర్ కేసు

    గత 15 ఏళ్లుగా తన నగ్న వీడియోలు అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ పదేపదే అత్యాచారం చేసి తన జీవితాన్ని నాశనం చేశాడని, ఓపిక నసించి శర్మాను చంపేశానని సవిత పోలీసుల ముందు బోరున విలపించింది. ఆత్మరక్షణ కోసం తాను శర్మాను హత్య చేశానని సవితా చెప్పినా పోలీసులు మాత్రం 302 సెక్షన్ కింద ఆమెపై హత్య కేసు నమోదు చేసి ఆమెను కోర్టు ముందు హాజరుపరిచి విచారణ చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+