Black panther: అరుదైన బ్లాక్ పాంథర్.. చూడగలిగే ఆరు ప్రదేశాలు ఇవే..!
భారత్ లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. కొండలు.. కోనలు.. కోటలు.. జలపాతాలు.. హిల్ స్టేషన్స్.. బీచ్ లు.. ఇలా అనేక టూరిస్టు సైట్స్ పర్యటకుల్ని అబ్బుర పరుస్తున్నాయి. అయితే భారత్ లో అరుదైన జంతువులు కూడా ఉన్నాయి. వీటిని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. కానీ అవి మనకు ఎక్కడ కనిపిస్తాయో తెలియదు. చాలామందికి బ్లాక్ పాంథర్ జంతువును చూడాలని కోరికగా ఉంటుంది.
పులి, చిరుత పులి, సింహం కాకుండా నల్లని రూపంలో చూడగానే ఆకర్షణీయంగా ఉండే ఈ బ్లాక్ పాంథర్ భారత్ లోని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లోనే మనకు దర్శనమిస్తుంది. ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపించే జంతువుల్లో బ్లాక్ పాంథర్ ఒకటి. దట్టమైన అడవుల్లో నివసించే ఈ జంతువును తక్కువమంది మాత్రమే ప్రత్యక్షంగా చూస్తుంటారు. అయితే భారత్ లోని ఈ ఆరు ప్రదేశాల్లో మాత్రం బ్లాక్ పాంథర్ ను చూసేందుకు అత్యుత్తమ ప్రదేశాలుగా చెబుతారు. వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
కర్ణాటకలోని దాండేలీ అంజి టైగర్ రిజర్వ్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ అరుదైన బ్లాక్ పాంథర్ మనకు కనిపిస్తుంది. ఇక్కడి అటవీ ప్రాంతంలో చెట్లు నిత్యం పచ్చగా ఉండి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంటాయి. ఆ సమయంలో ఇక్కడకు వెళ్లినప్పుడు అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. ట్రెక్కింగ్, ప్రకృతి పర్యటనలను ఇష్టపడేవారికి ఈ అడవి మంచి అనుభూతిని కలిగిస్తుంది. అలాగే మహారాష్ట్రలోని తాడోబా అంధేరి టైగర్ రిజర్వ్ చాలా పురాతనమైనది. ఇది చంద్రాపూర్ జిల్లాలో ఉంది. భారత్ లోని ప్రముఖ టైగర్ రిజర్వ్ లలో ఇది ఒకటి. ఇక్కడ అరుదైన బ్లాక్ పాంథర్ మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సుమారు 195 కు పైగా పక్షి జాతులు కూడా ఇక్కడే నివసిస్తున్నాయి.

నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ తమిళనాడు- కేరళ లో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో ఉంది. 2012 లో దీనిని యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ అభయారణ్యం తమిళనాడు, కేరళ మాత్రమే కాదు కర్ణాటకలోనూ విస్తరించి ఉంది. ఇక్కడ బ్లాక్ పాంథర్ జంతువుతోపాటు సింహం తోక గల కోతి కూడా చాలా ఫేమస్. వీటితో పాటు కర్ణాటక చిక్ మగళూరులోని భద్ర వన్యప్రాణి అభయారణ్యం, శరవతి వ్యాలీ వన్యప్రాణి అభయారణ్యం, నాగర్ హోలే నేషనల్ పార్క్ కు సమీపంలో ఉన్న కబిని అడవిలోనూ అరుదైన బ్లాక్ పాంథర్ లను వీక్షించవచ్చు.












Click it and Unblock the Notifications