ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో పేలుడు.. ఒకరు మృతి..

బెంగళూరు : కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఎమ్మెల్యే ఇంటి సమీపంలో జరిగిన పేలుడులో ఒక వ్యక్తి చనిపోయాడు. రాజరాజేశ్వరీ నగర్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న నివాసానికి సమీపంలో ఉదయం 9.15గం.ల సమయంలో ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి స్పాట్‌లోనే చనిపోయాడు.

శక్తివంతమైన పేలుడు కావడంతో మృతుని శరీర భాగాలు చిధ్రమయ్యాయి. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని దోభిఘాట్‌కు చెందిన వెంకటేశ్‌గా గుర్తించారు. అతని కూతురు ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తుందని విచారణలో తేలింది. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాడు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు.

Blast near MLA’s house in Bengaluru, one killed

ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో పేలుడు జరగిందన్న సమాచారం అందుకున్న వెంటనే వ్యాలికావల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సిటీ పోలీస్ కమిషనర్ సునీల్‌‍తో పాటు సెంట్రల్ డీసీపీ దేవ్‌రాజ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా స్థానికుల్ని ప్రశ్నిస్తున్న పోలీసులు ఆ ప్రాంతంలో రాకపోకల్ని నిలిపివేశారు. రంగంలోకి దిగిన ఎఫ్ఎస్‌ఎల్ టీం సాక్ష్యాలు సేకరించే పనిలో పడింది. పేలుడు జరిగిన ప్రాంతంలో చిన్న గుంట ఏర్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పార్కింగ్ ఏరియాలో జరిగిన ఈ బ్లాస్ట్‌ ప్రమాదవశాత్తూ జరిగిందా లేక బాంబు దాడి వల్లా అనే విషయం తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+