827 పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించండి... ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాల్సిందిగా ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. మొత్తం 827 పోర్న్ వెబ్‌సైట్లు బ్లాక్ చేయాల్సిందిగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కోరింది. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ హైకోర్టు మొత్తం 857 పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాల్సిందిగా ఆదేశించింది. అయితే ఐటీ మంత్రిత్వ శాఖ మాత్రం ఇందులో 30 వెబ్‌సైట్లలో ఎలాంటి పోర్న్ కంటెంట్ లేనందున వాటికి మినహాయింపు ఇచ్చింది. మొత్తం 827 పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాలంటూ ఐటీశాఖ టెలికాం శాఖకు ఓ జాబితా సమర్పించింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అన్ని లైసెన్సులు కలిగిన ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు 827 పోర్న్ వెబ్‌సైట్లపై నిషేధం విధించాలని టెలికాంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే హైకోర్టు సెప్టెంబర్ 27,2018న పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులు ఐటీశాఖకు అక్టోబర్ 8న అందాయి.

అదే రోజున టెలికాంశాఖకు హైకోర్టు ఆదేశాల గురించి లేఖలో ఐటీ శాఖ వివరించింది. 857 పోర్న్ వెబ్‌సైట్లపై తక్షణమే నిషేధం విధించాలని కోరింది. ఇది జూలై 31,2015లో పేర్కొన్న ఆదేశాలకు కొనసాగింపుగానే ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొంది. ఇదిలా ఉంటే టెలికాంశాఖ 2015 ఆగష్టు 4న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ వెబ్‌సైట్లలో పిల్లల పోర్న్‌కు సంబంధించిన కంటెంట్ ఉంటే వాటిని మాత్రమే తీసివేయాలని కోరింది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications