పోర్న్ సైట్స్ బ్లాకింగ్ ప్రమాదం: సుప్రీంతో కేంద్రం
న్యూఢిల్లీ: పోర్నోగ్రాఫిక్ కంటెంట్ ఉన్న దేశంలోని అన్ని వైబ్‌సైట్స్‌ను బ్లాక్ చేయడం అసాధ్యమని, దానివల్ల మరింత ప్రమాదం సంభవిస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సోమవారం కేంద్రం సుప్రీంకోర్టుకు ఆ విషయం చెప్పింది. ఈ మేరకు అదనపు సోలిసిటర్ జనరల్ కెవి విశ్వనాథన్ జస్టిస్ బిఎస్ చౌహాన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచీకి ఆ విషయం చెప్పారు.
పోర్న్ వెబ్‌సైట్స్‌ను బ్లాక్ చేస్తే మంచి సాహిత్యం కూడా బ్లాక్ అవుతుందని, దానివల్ల ఎక్కువ ప్రమాదం సంభవిస్తుందని ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆ విధమైన వెబ్‌సైట్సును బ్లాక్ చేయడానికి ప్రతి కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్‌ను పొందుపరచాల్సి ఉంటుందని, ఆ సాఫ్ట్‌వేర్‌ను చేర్చాలని ప్రతి కంప్యూటర్ తయారీదారుకు చెప్పాల్సి ఉంటుందని ఆయన వివరించారు

అసభ్యకరమైన వీడియోలను చూడడం నేరం కాకపోయినప్పటికీ పోర్నోగ్రాఫిక్ సైట్స్ మహిళలపై నేరాలు పెరగడానికి గల కారణాల్లో ఒకటని చెబుతూ వాటిని నిషేధించాలని కోరుతూ ఇండోర్‌కు చెందిన కమలేష్ వాస్వానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నవంబర్ 18వ తేదీన టెలీ కమ్యూనికేషన్ శాఖకు నోటీసులు జారీ చేసింది. దేశంలోని పోర్నోగ్రాఫిక్ కంటెంట్‌ను, ముఖ్యంగా చైల్డ్ పొర్నోగ్రాఫీని చూపించే కంటెంట్‌ను బ్లాక్ చేయడం ఎలా అనే విషయంపై వివరణ కోరింది.












Click it and Unblock the Notifications