సెక్స్ స్కామ్ లో నిత్యానంద స్వామి తరువాత అంత గొప్పోడు ఈ ఎంపీ, బ్లూకార్నర్ నోటీసులు !
అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ కేసు బయటకు రావడంతో హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఏప్రిల్ 28వ తేదీ రాత్రి జర్మనీకి పారిపోయారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు. బ్లూ కార్నర్ నోటీసు జారీ కావడంతో దేశం విడిచి వెళ్లిన ప్రజ్వల్ రేవణ్ణ కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఉచ్చు బిగించింది.
బ్లూ కార్నర్ నోటీసు ఇంటర్‌పోల్ కోడెడ్ నోటీసులలో ఒక భాగం. ఈ నోటీసు అమల్లోకి వస్తే, ప్రపంచంలోని వివిధ దేశాల అధికారులకు ఎవరి మీద బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారో ఆ వ్యక్త గురించి సమాచారం, వార్నింగ్ లతో పాటు అతని గురించి అప్పీళ్లు పంపిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నేర కార్యకలాపాలను నియంత్రించేందుకు అత్యంత కీలకమైన నేరాలకు సంబంధించిన సమాచారాన్ని ఇతర దేశాల అధికారులతో పంచుకోవడంలో ఈ బ్లూ కార్నర్ నోటీసు సహాయపడుతుంది.

తప్పించుకుని తిరుగుతున్న ఓ వ్యక్తిని గుర్తించడానికి, అతని కార్యకలాపాల గురించి అదనపు సమాచారాన్ని సేకరించడానికి ఈ బ్లూ కార్నార్ నోటీసు సహాయపడుతుంది. బ్లూ కార్నర్ నోటీసులతో పాటు మొత్తం ఏడు రకాల నోటీసులను దర్యాప్తు అధికారి లేదా సంబంధిత ఏజెన్సీ అధికారులు ఆ కేసుల ప్రకారం జారీ చేయవచ్చు. రెడ్ కార్నర్ నోటీసు, ఎల్లో కార్నర్ నోటీసు, బ్లూ కార్నర్ నోటీసు. బ్లాక్ కార్నర్ నోటీసు, గ్రీన్ కార్నర్ నోటీసు, ఆరెంజ్ కార్నర్ నోటీసు, పర్పుల్ కార్నర్ నోటీసు అనే ఏడు రకాల నోటీసులు వేర్వేరు అర్థాలను కలిగి ఉన్నాయి.
ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ జనరల్ సెక్రటేరియట్ ద్వారా ఇలాంటి నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసులు అమలు చేయబడితే ఆ వ్యక్తి గురించి సమాచారం, అతనికి హెచ్చరిక సందేశాలు అన్ని సభ్య దేశాలకు చేరతాయి. ఇలాంటి నోటీసులు ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా పోలీసు సహకారం, నేర నియంత్రణను సులభతరం చేస్తుంది.

అశ్లీల పెన్ డ్రైవ్ వ్యవహారం కేసుకు సంబంధించి ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చెయ్యండం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి వెళ్లి అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ చేపట్టేందుకు దర్యాప్తు సంస్థలు ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. దీని వల్ల ప్రజ్వల్ రేవణ్ణ గురించి సమాచారం ఏ దేశంలోనైనా అందుబాటులో ఉంటుంది.
ఎవరైనా ఏ దేశంలో ఉన్నారో తెలుసుకోవడానికి పాస్‌పోర్ట్ ఎంట్రీ ఉపయోగించబడుతుంది. అలాంటి సమయంలో అాలాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి ఆయా దేశాల అధికారులు దర్యాప్తు సంస్థలకు సహకరిస్తారు. 2019లో లైంగిక వేధింపులు, అత్యాచారాల ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన బెంగళూరు నగర శివార్లలోని బిడదిలోని దైవమానవుడు స్వామీ నిత్యానంద అలియాస్ నిత్యానంద స్వామిని వెతికి పట్టుకునేందుకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాజీ ప్రధాని మనుమడు, సిట్గింగ్ ఎంపీపై ఇలాంటి బ్లూ కార్నర నోటీసులు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications