చెన్నై బీచ్ లో వింత వెలుగు: రాత్రి వేళ నీలం రంగును సంతరించుకున్న సంద్రం!
Recommended Video
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై తీర ప్రాంతంలో ఆదివారం రాత్రి వింత వెలుగులు కనిపించాయి. తీర ప్రాంతం పొడవునా ఈ వెలుగులు సందర్శకులకు కనువిందు చేశాయి. హోరుమని శబ్దం చేస్తూ తీరానికి చేరుకునే అలలు నీలం రంగులో మెరిసిపోయాయి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లో నీటి అలలు నీలంరంగులో మెరిసిపోవడాన్ని వింతగా తిలకించారు చెన్నై వాసులు. తమ సెల్ ఫోన్లకు పని చెప్పారు. నీలం రంగును సంతరించుకున్న అలలను తమ సెల్ కెమెరాల్లో బంధించారు. అలలు తాకిన ప్రదేశం కూడా నీలంగా మారిపోవడం సందర్శకులను ఆశ్యర్యానికి గురి చేసింది.
ఆదివారం రాత్రి సుమారు 8 గంటల తరువాత క్రమంగా చెన్నైలోని తిరువాన్మియూర్ బీచ్ లో చెన్నైలోని తిరువాన్మియూర్ బీచ్ లో మొదటగా ఈ వింత వెలుగు కనిపించింది. తీర ప్రాంతం పొడవునా అదే తరహా వింత వెలుగులు అలముకున్నాయి. సముద్రం మీదుగా వీచే గాలుల్లో కూడా అసాధారణ తేడా కనిపించిందని సందర్శకులు చెబుతున్నారు. కొద్దిసేపు చల్లగా, క్షణాల్లోనే వేడి గాలులు వీచాయని, ఇలా ఎప్పుడూ చోటు చేసుకోలేదని సందర్శకులు వెల్లడించారు.

బయోలూమినెస్సీన్స్ వల్లే సముద్రం ఇలా నీలం రంగును సంతరించుకుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. సముద్ర జలాల్లో ఉండే ఓ రకమైన బ్యాక్టీరియాలతో పాటు, యాల్జీ, జెల్లిఫిష్, సముద్రపు పురుగులు, సముద్రాల్లో జీవించే నక్షత్రపు పురుగుల వల్ల ఈ నీలంరంగు అలముకుని ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

వాతావరణంలో చోటు చేసుకునే పెను మార్పుల (క్లైమెట్ ఛేంజ్) వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి ఓ కారణమౌతాయని అంచనా వేశారు. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు ప్యూర్టోరికో, శాన్ డియాగో, ఫ్లోరిడా, జపాన్ తీర ప్రాంతాల్లో తరచూ కనిపిస్తుంటాయని, చెన్నై తీరంలో ఏర్పడటం అరుదు అని అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications