Blue Drum murder case: బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో కీలక పరిణామం..

ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా చంపి అతడి శవాన్ని డ్రమ్​ లో దాచిపెట్టిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దోషులుగా తేలిన మృతుడి భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ కు మీరట్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఈ శిక్షను సవాల్ చేస్తూ దోషులు ఇద్దరూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని హైకోర్టులో సంయుక్తంగా అప్పీల్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలు కేవలం పరిస్థితులపై ఆధారపడినవని.. వాటిని కింది కోర్టు సరిగ్గా అంచనా వేయలేదని పిటిషన్‎ లో దోషులిద్దరూ పేర్కొన్నారు. ఈ మేరకు మీరట్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని అభ్యర్థించారు. ఈ అప్పీల్‌ పై వచ్చే వారం హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏం జరిగింది..?

మీరట్ కు చెందిన మర్చంట్‌ నేవీ ఉద్యోగి సౌరభ్‌ రాజ్‌పుత్​ కు, ముస్కాన్​ రస్కోగీకి 2016 లో వివాహం జరిగింది. అయితే సౌరభ్‌ ఉద్యోగం వదిలిపెట్టడంతో దంపతుల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే సౌరభ్​ స్నేహితుడు సాహిల్‌ శుక్లాతో ముస్కాన్​ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇదే విషయంపై సౌరభ్‌ రాజ్‌పుత్​- ముస్కాన్ ల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో వారికి అడ్డుగా ఉన్న సౌరభ్‌ ను చంపేయాలని ముస్కాన్‌ తన ప్రియుడితో కలిసి ప్లాన్​ చేసింది. ఈ క్రమంలోనే రాత్రి భోజనంలో నిద్ర మాత్రలు కలిపింది. అలా సౌరభ్‌ నిద్రలో జారుకున్నాక ప్రియుడితో కలిసి హత్య చేసింది. శవాన్ని 15 ముక్కలుగా కోసి ప్లాస్టిక్‌ డ్రమ్ములో వేసి సిమెంట్‌ తో కప్పిపెట్టింది. అనంతరం ప్రియుడితో కలిసి మనాలి పారిపోయింది.

BlueDrummurdercase news Muskan and Sahil move Allahabad High Court challenging their death sentence

అయితే సౌరభ్ కనిపించకుండా పోవడంతో అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ముస్కాన్ ఆమె ప్రియుడు సాహిల్ పై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా అసలు బండారం బయట పడింది. ఇక విచారణ ముగిసిన తర్వాత.. ఇటీవల మీరట్ జిల్లా కోర్టు దోషులిద్దరికీ ఉరిశిక్ష విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+