బీఓబీ ఫైనాన్షియల్‌లో 590 ఉద్యోగాలు: అప్లై చేయండి, ఫీజు లేదు
హైదరాబాద్: బీఓబీ ఫైనాన్సియల్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 590 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 25 ఏరియా సేల్స్ మేనేజర్, 65 టీమ్ లీడర్, 500 సేల్స్ ఎగ్జిక్యూటివ్స్(గ్రాడ్యూయేట్స్, అండర్ గ్రాడ్యూయేట్స్, ఫ్రెషర్స్), మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగార్థులు మే 25, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
బ్యాంక్ పేరు: బీఓబీ ఫైనాన్సియల్ సొల్యూషన్స్ లిమిటెడ్
పోస్టు పేరు: ఏరియా సేల్స్ మేనేజర్, టీమ్ లీడర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్
ఖాళీల సంఖ్య: 590
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా.
చివరి తేదీ: మే 25, 2018
విద్యార్హత:
ఏరియా సేల్స్ మేనేజర్: ప్రభుత్వ గుర్తింపు పొంది యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి గ్రాడ్యూయేట్, ఎంబీఏ అభ్యర్థులకు ప్రాధాన్యత లేదా తత్సమాన విద్యార్హత.

టీమ్ లీడర్: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి గ్రాడ్యూయేట్.
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్(గ్రాడ్యూయేట్): ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఇంజినీరింగ్ డిప్లొమా హోల్డర్స్.
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్(అండర్ గ్రాడ్యూయేట్స్): అభ్యర్థులు డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన వారు అర్హులు.
సేల్స్ ఎగ్జిక్యూటివ్(ఫ్రెషర్స్): ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా సంస్థ నుంచి గ్రాడ్యూయేట్.
మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్-ప్రాసెసింగ్: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి గ్రాడ్యూయేట్.
వయో పరిమితి: 01.05.2018 నాటికి ఏరియా సేల్స్ మేనేజర్ అభ్యర్థులు 30-40ఏళ్లు, టీమ్ లీడర్ అభ్యర్థులు 25-40ఏళ్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్(గ్రాడ్యూయేట్స్) అభ్యర్థులు 21-35ఏళ్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్(అండర్ గ్రాడ్యూయేట్స్) అభ్యర్థులు 21-30ఏళ్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్(ఫ్రెషర్స్) అభ్యర్థులు 21-25ఏళ్లు, మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్ ప్రాసెసింగ్ అభ్యర్థులు 30-40ఏళ్లు.
ఎంపిక ప్రక్రియ:
- షార్ట్ లిస్టింగ్
- అప్టిట్యూడ్ టెస్ట్(రాత పరీక్ష)
- పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్
ఫీజు వివరాలు: ఫీజు లేదు
ముఖ్య తేదీలు:
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 25.05.2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications