అమ్మాయిని బతికుండగానే ముక్కలు ముక్కలుగా నరికి చంపేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమానుషత్వం పడగ విప్పింది. బతికుండగానే చిత్రహింసలు పెడుతూ కరెంట్ రంపంతో ఆమె కాళ్లు, చేతులు, వేళ్లు, తల ఇలా ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఓ జంతు వధశాలలో ముక్కలుముక్కలుగా నరికారు. ఆమె పేరు గౌరి శ్రీవాస్తవ. 20 ఏళ్ల న్యాయశాస్త్రం విద్యార్థిని అయిన ఆమె ఊరు ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో.
ఆదివారంనాడు అదృశ్యమైన ఆమె కిరాతక మూక చేతుల్లో దారుణంగా హత్యకు గురై ముక్కలుగా కనిపించింది. ఆమె దేహ ఖండాలను దుర్మార్గులు ఓ బస్తాలో మూటగట్టి పడేశారు. దొరికిన ఆమె మృతదేహం భాగాలకు పోస్ట్‌మార్టం నిర్విహించిన వైద్యులు రేప్‌ను మాత్రం నిర్ధారించలేదు. కేసును సరిగా విచారించాల్సిన పోలీసులూ గౌరి తండ్రితో అసభ్యంగా ప్రవర్తించడం మరో దారుణమైన విషయం.
తన కూతురు కనిపించట్లేదని ఫిర్యాదు చేస్తే 6 ‘ఎవడితోనో లేచిపోయి ఉంటుంది' అంటూ పోలీసులు అసభ్యంగా మాట్లాడారని, స్టేషన్ నుంచి గెంటేశారని ఆమె తండ్రి శిశిర్ శ్రీవాస్తవ కన్నీరుమున్నీరయ్యారు. అక్కడి ఓ జంక్షన్ వద్ద ఉన్న సీసీటీవీలో ఆమె ఎవరో యువకుడితో మాట్లాడిన సంభాషణలను పోలీసులు ఛేదిస్తున్నారు. ఆ యువకుడు ఎవరనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. అంతేగాకుండా ఆమె ఫేస్‌బుక్ స్నేహితులనూ విచారిస్తున్నారు.
ఆదివారంనాడు అపహరణకు గురైన ఆమె సోమవారంనాడు హత్యకు గురైంది. పోలసులు నలుగురు వ్యక్తులను అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు ప్రేమవ్యవహారం కారణమై ఉండవచ్చునని వారు భావిస్తున్నారు.

ఆదివారంనాడు మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు గురుద్వారాకు బయలుదేరిన ఆమె ఆ తర్వాత కనిపించకుండా పోయిందని తండ్రి చెబుతున్నారు. ఆమె సెల్‌ఫోన్ స్విఛాఫ్ అయి ఉందని, సాయంత్రం ఆరున్నర గంటలకు తిరిగి పనిచేసిందని, అయితే ఎన్ని మార్లు ఫోన్ చేసినా సమాధానం రాలేదని అంటున్నాడు. ఆ ఫోన్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి ఆలమ్‌బాగ్‌లోని విఐపి రోడ్డుకు రావాలని చెప్పాడని ఆయన అన్నారు. అతని ఫోన్ నెంబర్ ఇవ్వడానికి అతను నిరాకరించాడని చెప్పారు.
ఆ వ్యక్తి మళ్లీ ఫోన్ చేసి అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదని, చికిత్స నిమిత్తం ఎస్‌జిపిజిఐకి తీసుకుని వెళ్లామన చెప్పినట్లు తెలిపాడు. అవధ్ ఆస్పత్రిలో చేర్చించాలని తాను చెప్తే వినలేదని అన్నారు. ఆ తర్వాత ఆ ఫోన్‌కి కాల్ చేస్తే స్విచాఫ్ వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత ఆమె శవం పిజిఐ వద్ద సోమవారంనాడు కనిపించింది. కాళ్లు ఓ చోట, ఇతర శరీర భాగాలు మరో చోట కనిపించాయి.












Click it and Unblock the Notifications