Cyber Crime: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన నగ్మా.. ఎంత పోగొట్టుకుందంటే..!
నటి నగ్మా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.
నటి, రాజకీయ నాయకురాలు నగ్మా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. బ్యాంక్ కేవైసీ చేసుకోవాలని ఆమె ఫోన్‌కు టెక్స్ట్ సందేశంగా వచ్చింది. అది నమ్మిన అమె స్పామ్ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 1 లక్షను సైబర్ నేరగాళ్లు కొళ్లగొట్టారు. ఫిబ్రవరి 28న బ్యాంక్ వాళ్లు పంపినట్లు గా మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో మీరు మీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ పూర్తి చేసుకోవాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి అని ఉంది.

80 మంది బాధితులు
ఇది నిజమే అని నమ్మిన నగ్మా లింక్ పై క్లిక్ చేసింది. ఆ వెంటనే ఆమెకు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ వివరాలు, ఓటీపీ చెప్పాలని కోరారు. దీంతో నగ్మా ఓటీపీ చెప్పింది. దీంతో ఆమె ఖాతాలోని రూ. 99,998 డెబిట్ అయ్యాయి. ఆ తర్వాత మోసపోయినట్లు తెలుసుకన్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు ఖాతా మోసం ద్వారా కొద్ది రోజుల్లోనే అనేక లక్షల రూపాయలు మోసపోయిన 80 మంది బాధితుల్లో నగ్మా కూడా ఉన్నారు. దాదాపు బాధితులందరూ ఒకే ప్రైవేట్ బ్యాంకుకు చెందిన వారు.

ఇంటర్నెట్ బ్యాంకింగ్
"సైబర్ నేరగాళ్లు నా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయిన తర్వాత లబ్ధిదారుడి ఖాతాను సృష్టించాడు. జాతీయ బ్యాంకుకు రూ. 1 లక్షను బదిలీ చేశాడు. నాకు అనేక OTPలు వచ్చాయి, అవి కనీసం 20 ప్రయత్నాలు చేసినట్లు చూపాయి. అదృష్టవశాత్తూ నేను పెద్ద మొత్తాన్ని కోల్పోలేదు" అని నగ్మా పేర్కొంది. మోసగాడు తన ఫోన్‌కు రిమోట్ యాక్సెస్ పొందాడని, అయితే లింక్‌పై తాను ఎలాంటి వివరాలను పంచుకోలేదని ఆమె స్పష్టం చేసింది.

సల్మాన్ ఖాన్
లాంటి మెసేజ్‌ల జోలికి పోవద్దని ముంబై సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ మోసాలు సాధారణమయ్యాయని చెప్పారు. అందరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నగ్మా 1990లో సల్మాన్ ఖాన్ నటించిన యాక్షన్ చిత్రం బాఘీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె కింగ్ అంకుల్, సుహాగ్, యల్గార్, లాల్ బాద్షా, చల్ మేరే భాయ్, కున్వారా, అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ లోనే కాకుండా తెలుగు, తమిళం, భోజ్‌పురి, మలయాళం, కన్నడ చిత్రాలలో కూడా నటించారు. నగ్మా 2004లో కాంగ్రెస్‌లో చేరి ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేశారు. ఆమె 2014 లోక్‌సభ ఎన్నికల్లో మీరట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె 2015లో అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications