బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కు పెరోల్

ముంబై: ముంబై వరుస బాంబు పేలుళ్లు జరిగిన సమయంలో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో అరెస్టు అయ్యి 2014 డిసెంబర్ నుండి యేర్వాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఉన్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు 30 రోజులు పెరోల్ మంజూరు అయ్యింది.

సంజయ్ దత్ (56) కుమార్తె ముక్కుకు ఆపరేషన్ చేయించుకుంటున్నది, ఈ సందర్బంగా తన కుమార్తె మంచి చెడులు చూసుకోవడానికి తనకు పెరోల్ మంజూరు చెయ్యాలని సంజయ్ దత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

సంజయ్ దత్ అర్జీని పరిశీలించిన న్యాయస్థానం పెరోల్ మంజూరు చేసింది. సంజయ్ దత్ ఇప్పటి వరకు మూడు సార్లు పెరోల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు 30 రోజుల పాటు సంజయ్ దత్ పెరోల్ పై జైలు బయట ఉంటున్నారు.

Bollywood actor Sanjay Dutt Gets 30-Day Parole

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల సందర్బంగా సంజయ్ దత్ ఇంటిలో పోలీసులు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వరుస బాంబు పేలుళ్ల కేసుతో సంజయ్ దత్ కు సంబంధం లేకపోయినా అక్రమంగా ఆయుధాలు పెట్టుకున్నారని వెలుగు చూసింది.

ఈ కేసులో 18 నెలలు జైలులో ఉన్న సంజయ్ దత్ తరువాత జామీను మీద బయటకు వచ్చారు. ఈ కేసులో సంజయ్ దత్ దోషిగా తేలడంతో ఆరు సంవత్సరాలు జైలు శిక్ష విదించారు. గత సంవత్సరం డిసెంబర్ నుండి సంజయ్ దత్ జైలు జీవితం గడుపుతున్నాడు.

సంజయ్ దత్ కు జైలులో వీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నారని, అయితే నిత్యం ఆయనకు పదే పదే పెరోల్ మంజూరు చేస్తున్నారని, సాటి ఖైదీలు పెరోల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని కొందరు కోర్టులో పిటిషన్ వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+