మరాఠీ నటి అల్కా అదృశ్యం, లోయలో కనిపించిన కారు
ముంబై: మరాఠీ నటి అల్కా పునేవర్ గత తొమ్మిది రోజులుగా కనిపించడం లేదు. అల్కా వయ్ససు 49. డిసెంబర్ 27వ తేదీన ఇంటి నుండి వెళ్లిన అల్కా పునేవర్ తిరిగి రాలేదని ఆమె భర్త సంజయ్ పునేవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముంబై - పుణే రోడ్డులోని ఖోపోలి సమీపంలో ఆమె కారును పోలీసులు గుర్తించారు. ఖొబపోలి సమీపంలో ఏడువందల అడుగుల లోతైన లోయలో ధ్వంసమై పడి ఉన్న అల్కా కారును డిసెంబర్ 30వ తేదీన పోలీసులు గుర్తించారు.

కారులో ఆమె సెల్‌ఫోన్, బ్యాగు ఉన్నాయి. అయితే, అల్కా ఆచూకీ లభించలేదు. అల్కా భర్త సంజయ్ ఫిర్యాదు మేరకు కోప్రి పోలీసులు ఐదు రోజుల క్రితం కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఆమె గురించి గాలిస్తున్నారు.
అల్కాను తాను థానే రైల్వే స్టేషన్లో తన కారులో దింపానని, అక్కడే ఆమెను వారి డ్రైవర్ పికప్ చేసుకున్నాడని, అరగంట తర్వాత తన భార్య తనకు ఫోన్ చేసి డ్రైవర్ పికప్ చేసుకున్నాడని, తాము వెళ్తున్నామని చెప్పిందని భరత్ సంజయ్ చెప్పాడు.
అయితే, డిసెంబర్ 28న మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్ వచ్చిందని, అల్కా ఇంటికి చేరిందా అని ప్రశ్నించారని, అయితే తాను అల్కాకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదని సంజయ్ చెప్పారు.












Click it and Unblock the Notifications